మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి

ABN , First Publish Date - 2021-10-24T04:20:18+05:30 IST

స్వయం ఉపాధితో మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని అదనపు కలెక్టర్‌ మదుసూధన్‌నాయక్‌ అన్నారు. శనివారం దేవా పూర్‌లో పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంతో పాటు అక్షరాభ్యాస కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.

మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
దేవాపూర్‌ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా అదనపు కలెక్టర్‌ మదుసూధన్‌నాయక్‌

కాసిపేట, అక్టోబరు 23: స్వయం ఉపాధితో మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలని అదనపు కలెక్టర్‌ మదుసూధన్‌నాయక్‌ అన్నారు. శనివారం దేవా పూర్‌లో పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రంతో పాటు అక్షరాభ్యాస కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మహిళలు  స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలన్నారు.  ఈచ్‌ వన్‌ టీచ్‌ ఫైవ్‌ నినాదంతో పల్లెల్లో అవగాహన కల్పించారు. ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, సర్పంచు మడావి తిరుమలఅనంతరావు, ఎంపీటీసీ  పద్మ, పురుషోత్తం నాయక్‌, డీఆర్‌పీ శాంకరి పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-24T04:20:18+05:30 IST