మహిళలు ఆర్థికంగా ఎదగాలి

ABN , First Publish Date - 2022-01-26T05:31:56+05:30 IST

అగ్రవర్ణాలకు చెందిన పేద మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే వైఎస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య అన్నారు.

మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ఈబీసీ నేస్తం చెక్కును అందజేస్తున్న మున్సిపల్‌ చైర్మన్‌


గిద్దలూరు టౌన్‌, జనవరి 25 : అగ్రవర్ణాలకు చెందిన పేద మహిళలు ఆర్థికంగా ఎదగాలన్న ఉద్దేశంతోనే వైఎస్‌ఆర్‌ ఈబీసీ నేస్తం పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మున్సిపల్‌ చైర్మన్‌ పాముల వెంకటసుబ్బయ్య అన్నారు. మంగళవారం నగర పంచాయతీ కార్యాలయం ఆవరణలో పథకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ పట్టణంలోని 336 మంది 50.40 లక్షల రూపాయలు ఈబీసీ నేస్తం ద్వారా లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు. అనంతరం చెక్కును అందజేశారు. కార్యక్రమంలో వైస్‌ చైర్మన్లు ఆర్‌.డి.రామకృష్ణ, కాతా దీపిక, నగర పంచాయతీ కమిషనర్‌ రామక్రిష్ణయ్య, కౌన్సిలర్లు గడ్డం భాస్కర్‌రెడ్డి, లొక్కు రమేష్‌, కోఆప్షన్‌ సభ్యులు దమ్మాల జనార్థన్‌, మానం బాలిరెడ్డి, షేక్‌ మస్తాన్‌వలి,  వైసీపీ నాయకులు ముద్దర్ల శ్రీనివాసులు, కాతా రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

 


Updated Date - 2022-01-26T05:31:56+05:30 IST