Abn logo
Sep 20 2021 @ 16:25PM

వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైంది: లోకేష్‌

అమరావతి: వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని టీడీపీ నేత లోకేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీఎస్ఎస్‌సీలో ఏడీ సుబ్బారెడ్డి త‌మ‌ను లైంగికంగా వేధిస్తున్నాడని, మ‌హిళా ఉద్యోగులు పోలీసులకు, మ‌హిళా కమిషన్‌కు ఫిర్యాదులిచ్చినా చర్యల్లేవని తప్పుబట్టారు. హత్యాచారాలకు బలైనవారి మృతదేహాలకు రూ.10 ల‌క్షల‌ రేటుక‌ట్టే ప్రభుత్వం.. సుబ్బారెడ్డిపై చ‌ర్యలు ఎందుకు తీసుకోవ‌డం లేదు? అని నారా లోకేష్‌ ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండిImage Caption