విజయవాడ: దిశ యాప్‌పై అవగాహన కల్పిస్తూ ఉమెన్ సేఫ్టీ వాక్

ABN , First Publish Date - 2021-10-03T16:41:44+05:30 IST

దిశ యాప్‌పై అవగాహన కల్పిస్తూ ఉమెన్ సేఫ్టీ వాక్ బెంజిసర్కిల్ నుంచి స్టేడియం వరకు జరిగింది.

విజయవాడ: దిశ యాప్‌పై అవగాహన కల్పిస్తూ ఉమెన్ సేఫ్టీ వాక్

విజయవాడ: ఎంజే నాయుడు హాస్పటల్స్ ఆధ్వర్యంలో దిశ యాప్‌పై అవగాహన కల్పిస్తూ ఉమెన్ సేఫ్టీ వాక్ బెంజిసర్కిల్ నుంచి స్టేడియం వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్ధినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలీసు కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, నగర సిపి శ్రీనివాసులు వాక్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం ప్రభుత్వం అనేక నూతన విధానాలను అమలు‌ చేస్తుందన్నారు. దిశ యాప్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని సూచించారు. ‘దిశ యాప్ మీ ఫోన్‌లో ఉంటే... పోలీస్ మీతో ఉన్నట్లే.. ఆపద సమయంలో దిశ యాప్‌తో ఒక్క బటన నొక్కండి.. నిమిషాల్లో మా పోలీసులు మీ చెంతకు చేరుకుంటారని’ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని, అందరితో చేయించాలని సూచించారు.

Updated Date - 2021-10-03T16:41:44+05:30 IST