షఫాలీ ర్యాంక్‌ పతనం

ABN , First Publish Date - 2021-10-13T06:49:39+05:30 IST

టీమిండియా టీనేజ్‌ బ్యాటర్‌ షఫాలీ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోల్పోయింది. తాజా టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో షఫాలీ (726 పాయింట్లు) నెంబర్‌ వన్‌ నుంచి రెండో స్థానానికి పడిపోయింది.

షఫాలీ ర్యాంక్‌ పతనం

మహిళల టీ20 ర్యాంకింగ్స్‌ 

దుబాయ్‌: టీమిండియా టీనేజ్‌ బ్యాటర్‌ షఫాలీ వర్మ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కోల్పోయింది. తాజా టీ20 ర్యాంకింగ్స్‌ బ్యాటింగ్‌ విభాగంలో షఫాలీ (726 పాయింట్లు) నెంబర్‌ వన్‌ నుంచి రెండో స్థానానికి పడిపోయింది. ఆస్ట్రేలియా బ్యాటర్‌ బెత్‌ మూనీ (754) రెండు నుంచి అగ్రస్థానానికి చేరింది. భారత స్టార్‌ బ్యాటర్‌ స్మృతీ మంధాన (709) నాలుగు నుంచి మూడో ర్యాంక్‌కు ఎగబాకింది. బౌలింగ్‌ విభాగంలో దీప్తీ శర్మ ఒక స్థానం మెరుగుపర్చుకొని 5వ ర్యాంక్‌లో నిలిచింది. సోఫియా ఎకిల్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌) అగ్రస్థానంలో ఉంది. ఆల్‌రౌండర్‌ విభాగంలో దీప్తీ శర్మ నాలుగో ర్యాంక్‌ పది లం చేసుకొంది. సోఫియా డివైన్‌ (న్యూజిలాండ్‌) టాపర్‌గా కొనసాగుతోంది. 

Updated Date - 2021-10-13T06:49:39+05:30 IST