Abn logo
Sep 21 2021 @ 18:20PM

అశ్వారావుపేటలో మహిళా దొంగల హల్‌చల్

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో మహిళా దొంగలు హల్‌చల్ చేసారు. అశ్వారావుపేటలో ముగ్గురు మహిళలు పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అశ్వారావుపేట మండలంలోని వినాయకపురం యూనియన్ బ్యాంక్‌లో క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చిన జెట్టి మంగమ్మ వద్ద 30 వేల రూపాయలను మహిళలు చోరీ చేసారు.


అలాగే  పట్టణంలో కుదవా పెట్టిన బంగారాన్ని విడిపించడానికి వచ్చిన ఫైనాన్స్ దుకాణం వద్ద  ఉట్లపల్లి గ్రామానికి చెందిన మడకం కుమారి వద్ద మరో 50 వేలను దొంగిలించారు. మహిళా దొంగల చోరీపై  పోలీసులు విచారణ జరుపుతున్నారు. 


ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...