డాక్టర్‌నంటూ ఎన్నారైకు వల.. రూ. 65 లక్షలు వసూలు చేసి..

ABN , First Publish Date - 2020-05-28T22:53:05+05:30 IST

ఎన్నారైను మోసం చేసిన కేసులో తల్లి మాళవిక, కుమారుడు ప్రణవ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో ..

డాక్టర్‌నంటూ ఎన్నారైకు వల.. రూ. 65 లక్షలు వసూలు చేసి..

హైదరాబాద్‌: ఎన్నారైను మోసం చేసిన కేసులో తల్లి మాళవిక, కుమారుడు ప్రణవ్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి పేరుతో రూ.65 లక్షలు వసూలు చేసినట్లు కాలిఫోర్నియాకు చెందిన వరుణ్ ఫిర్యాదు చేశారు. భారత్ మాట్రిమోనిలో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి ఎన్నారైలకు మాళవిక వల వేసింది. తాను ఓ డాక్టర్‌‌ను అంటూ..చాలా ఆస్తులు ఉన్నాయంటూ నమ్మించిన మాళవిక.. నాన్న చనిపోయాడని..ఆస్తి కోసం తన తల్లి హింసిస్తున్నట్టు కట్టు కథలు చెప్పింది. ఆస్తులు కాపాడుకోవడం కోసం లీగల్‌గా ఫైట్ చేయడానికి వరుణ్‌‌ను మాళవిక సాయం కోరింది. తర్వాత పెళ్లి చేసుకుంటానని..తన ఆస్తులకు మీరే యజమాని అంటూ మాయ మాటలు చెప్పింది. మాళవిక మాటలు నమ్మి వరుణ్ రూ.65 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశారు. మాళవిక మోసం చేసిందని తెలుసుకున్న వరుణ్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. 

Updated Date - 2020-05-28T22:53:05+05:30 IST