మహిళలదే పైచేయి !

ABN , First Publish Date - 2021-03-03T05:29:04+05:30 IST

జి ల్లాలో అర్బన్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో పు రుషుల కన్నా మహిళా ఓటర్లే అధికం గా ఉన్నారు. ఎన్నికలలో వారి నిర్ణయం ఫలితాలపై ప్ర కటన చూపే అవకాశం అధికంగా కనిపిస్తున్నది.

మహిళలదే పైచేయి !

అన్ని అర్బన్‌ సంస్థల్లోనూ వారి ఓటర్లే అధికం 

ఎన్నికల ఫలితాల్లోనూ కీలకం


ఒంగోలు, మార్చి 2 (ఆంధ్రజ్యోతి) : జి ల్లాలో అర్బన్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో పు రుషుల కన్నా మహిళా ఓటర్లే అధికం గా ఉన్నారు. ఎన్నికలలో వారి నిర్ణయం ఫలితాలపై ప్ర కటన చూపే అవకాశం అధికంగా కనిపిస్తున్నది. జిల్లాలో మొ త్తం 10 అర్బన్‌ స్థానిక సంస్థలు ఉండ గా అందులో ఏడింటిలో ప్రస్తుతం ఎ న్నికలు జరుగుతున్నాయి. ఒంగోలు న గర పాలకసంస్థతో పాటు చీరాల, మా ర్కాపురం మునిసిపాలిటీలు, అలాగే అ ద్దంకి, చీమకు ర్తి, కనిగిరి, గిద్దలూరు నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగు తున్నాయి. ఆయా అర్బన్‌ స్థానిక సంస్థల్లో వా ర్డుల వారీ రిజర్వేషన్లకు అనుగుణంగా కూడా ఓటర్ల జాబితాలను అధికారులు రూపొందిం చి ప్రకటించారు. ప్రస్తుతం ఎన్నికలు జరగను న్న ఏడు అర్బన్‌ స్థానిక సంస్థలలో కలిపి మొ త్తం 4,23,143 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,17,006 మంది మహిళా ఓటర్లు ఉండగా, 2,05,467మంది పురుషులు, 670 మంది ఇత రులు ఉన్నారు. అదే సమయంలో ఒంగోలు నగర పాలక సంస్థతో పాటు మిగిలిన ఆరు అర్బన్‌ స్థానిక సంస్థల్లోనూ మహిళా ఓటర్ల సంఖ్యే అధికంగా ఉంది. సాధారణంగా ఓట్ల పోలింగ్‌లో మహిళలే అధికంగా ఉంటుంటారు. ఈ నేపథ్యంలో అర్బన్‌ స్థానిక సంస్థల ఎన్ని కల ఫలితాల్లో మహిళా ఓటర్ల అభిప్రాయం కీ లకం కానుంది. వారి ఆదరణ దక్కే అభ్య ర్థుల కు విజయం అనుకూలించే అవకాశం ఉంది.  


అర్బన్‌ పేరు ఓటర్లు         మహిళలు పురుషులు


ఒంగోలు కార్పొరేషన్‌ 1,81,750 93,980 87,736

మార్కాపురం 58,513 29,702 28,811

చీరాల 67,707 34,636 32,437

అద్దంకి 29,067 14,985 14,078

చీమకుర్తి 22,315 11,319 10,996

గిద్దలూరు         30,233 15,400 14,829

కనిగిరి 33,574 16,984 16,580


మొత్తం 4,23,143 2,17,006 2,05,467

Updated Date - 2021-03-03T05:29:04+05:30 IST