‘చేయూత’తో మహిళల ఆర్థికాభివృద్ధి

ABN , First Publish Date - 2021-06-23T05:32:16+05:30 IST

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్‌ వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టడం ఆనందదాయకమని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు.

‘చేయూత’తో మహిళల ఆర్థికాభివృద్ధి
చేయూత చెక్కులను మహిళలకు అందిస్తున్న ఎంపీ భరత్‌రామ్‌

  •  రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌
  • చేయూత పథకం రెండో విడత కార్యక్రమం

 రాజమహేంద్రవరం సిటీ/రూరల్‌, జూన్‌ 22: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్‌ వైఎస్సార్‌ చేయూత పథకాన్ని ప్రవేశపెట్టడం ఆనందదాయకమని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. చేయూత పథకం రెండో విడత కార్యక్రమంలో భాగంగా మంగళవారం రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ కార్యాలయంలో చేయూత నగదు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ఆయన వీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ఎంపీ ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. చేయూత రెండో విడతలో భాగంగా అర్బన్‌, రూరల్‌ ప్రాంతాల్లో ఒక్కో మహిళకు రూ.18,750 చొప్పున రూ.42 కోట్లను 45-60 ఏళ్ళ మధ్య వయసున్న మహిళలకు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఎలాంటి పథకం లేదని, కరోనా కష్టకాలంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు చేయూత నగదు అండగా నిలుస్తుందని ఎంపీ సంతోషం వ్యక్తంచేశారు. అలాగే రాజమహేంద్రవరం రూరల్‌ మండలంలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ భరత్‌ ముఖ్యఅతిథిగా విచ్చేసి 10,800 మంది మహిళలకు చెక్కును అందజేశారు సీఎం ఇస్తున్న ఆర్థిక భరోసాతో కుటుంబాలకు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు వినియోగించుకోవాలని చెప్పారు. ఆయా కార్యక్రమాల్లో కార్పొరేషన్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిశోర్‌, అడిషనల్‌ కమిషనర్‌ ఎన్‌వీవీ సత్యనారాయణ, రూరల్‌ కోఆర్డినేటర్‌ చందన నాగేశ్వర్‌, మాజీ కోఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల బాబు, ఎంపీడీవో రామారావు, ఏపీఎం పద్మావతి పాల్గొన్నారు.  

Updated Date - 2021-06-23T05:32:16+05:30 IST