మహిళలు అగ్రస్థానంలో నిలవాలి

ABN , First Publish Date - 2021-03-09T06:54:08+05:30 IST

ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలవాలని కనెక్ట్‌ టు ఏపీ సీఈవో వి.కోటేశ్వరమ్మ చెప్పారు.

మహిళలు అగ్రస్థానంలో నిలవాలి
జేసీ మాధవీలతకు సత్కారం

విజయవాడ కల్చరల్‌, మార్చి 8(ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం ఉన్న ఆధునిక సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ అగ్రస్థానంలో నిలవాలని కనెక్ట్‌ టు ఏపీ సీఈవో వి.కోటేశ్వరమ్మ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమీ, తెలుగు కళావాహిని, ఏపీ ఎడిటర్స్‌ అసోసియేషన్‌, మూవీ మ్యాక్స్‌, జయహో భారతి ఆధ్వర్యాన గాంధీనగర్‌లోని ఐలాపురం హోటల్‌లో సోమవారం కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ మహిళలు ధైర్యంగా ముందుకు సాగాలన్నారు.

ఈ కార్యక్రమంలో రెరా డైరెక్టర్‌ చందు సాంబశివరావు, ఎక్సైజ్‌ ఈఎస్‌ ఎం.సునీత, ఆంధ్రా ఆర్ట్స్‌ అకాడమీ చైర్మన్‌ గోళ్ల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యావేత్త డాక్టర్‌ డి.ఉమారాణి, వ్యవసాయ మార్కెటింగ్‌ ఏడీ ఎ.శారదారాణి, డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌వో డాక్టర్‌ జె.ఇందుమతి దేవి, ఆర్‌ఐ ఆర్‌.శిరీష, సైకాలజిస్ట్‌ ఎల్‌.సునీత, ఎల్వీ బిల్డర్స్‌ ఎండీ వి.లక్ష్మీరవళి, బిజినెస్‌ స్కూల్‌ హెచ్‌వోడీ కేఎన్‌ పద్మిని, కల్చర్‌ యాక్టివిస్ట్‌ జమన చంద్రిక, మేకపాటి సాయి మంజుల, ఇంజనీర్‌ హవిష, జమన దేవికా రాణి, ఆధ్యాత్మికవేత్త ఆర్‌.శ్రీలక్ష్మీ దేవిలను ఘనంగా సత్కరించారు

మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

విజయవాడ సిటీ: ఏపీ ఎన్జీవో మహిళా విభాగం ఆధ్వర్యాన అంతర్జాతీయ మహిళా దినోత్సవం గాంధీనగర్‌లోని ఎన్జీవో హోంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రిన్సిపల్‌ కార్యదర్శి వి.ఉషారాణి, జేసీ కె.మాఽధవీలత, ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి ప్రసంగించారు. వివిధ స్థాయిల్లో టి.వి. చానళ్లలో పని చేస్తున్న మహిళా సిబ్బందిని శాలువా, మెమొంటోలతో సత్కరించారు. ఈ నెల 3, 4 తేదీల్లో నిర్వహించిన ఆటల పోటీలు, వ్యాస రచన, సాంస్కృతిక పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఎన్జీవో మహిళా విభాగం రాష్ట్ర చైర్మన్‌ వి.నిర్మలా కుమారి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శులు తులసి రత్నం, బి.జానకి, అఖిల భారత ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య కార్యవర్గ సభ్యురాలు రాజ్యలక్ష్మి,  సంఘ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎ.విద్యాసాగర్‌, ఎం.డి. ఇక్బాల్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్డియా కోర్‌ ఫిట్‌ ఉమెన్‌ చాలెంజ్‌

పాయకాపురం : వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళామణుల విజయాల స్ఫూర్తితో ‘ఫిట్‌ ఉమెన్‌ చాలెంజ్‌’ అనే వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని ఎస్పీ(సైబర్‌ క్రైం) రాధిక పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంజీ రోడ్డులోని హోటల్‌ లెమన్‌ ట్రీ ప్రీమియర్‌లో కార్డియా కోర్‌ ఆధ్వర్యాన ఫిట్‌ ఉమెన్‌ ఛాలెంజ్‌ నిర్వహించారు. సోమవారం జరిగిన ముగింపు కార్యక్రమంలో రాధిక ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో ఆధునిక పద్ధతుల్లో నిర్వహించిన శరీర దారుఢ్య పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో స్విమ్మర్‌ వి. విజయశ్రీ గుప్తా, పూర్ణా హార్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ సీఈవో డాక్టర్‌ జి. నీరజ, వివిధ రంగాల మహిళలు పాల్గొన్నారు.

 మహిళా సాధికారతకు మరిన్ని మార్పులు 

విజయవాడ సిటీ: మహిళా సాధికారతకు మరిన్ని మార్పులు రావాలని మానసిక వైద్యురాలు, విశిష్ట మహిళా పురస్కార గ్రహీత టి.కృష్టకుమారి తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గాంధీనగర్‌లోని చిట్టూరి పబ్లిక్‌ స్కూల్‌లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిఽథిగా ఆమె పాల్గొన్నారు. పాఠశాల ప్రధాన అధ్యాపకురాలు సుధారాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కె.నాగజ్యోతి, పి.హారిక, యామిని తదితరులతో పాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు. మహిళలకు నిర్వహించిన ఆటల పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. తొలుత చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.




Updated Date - 2021-03-09T06:54:08+05:30 IST