బెంగా‌ల్‌లో పోటీ చేయం, మమతాకే మద్దతు: శివసేన

ABN , First Publish Date - 2021-03-04T21:02:34+05:30 IST

ఎనిమిది విడతల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 2న ఫలితాలు విడుదల అవుతాయి. అయితే బెంగాల్‌లో ఎనిమిది విడతల పోలింగ్‌పై మమతా బెనర్జీ సహా అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. బెంగాల్‌తో పాటే ఎన్నికలు జరగనున్న

బెంగా‌ల్‌లో పోటీ చేయం, మమతాకే మద్దతు: శివసేన

ముంబై: త్వరలో జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో శివసేన పోటీ చేయడం లేదని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రౌత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా గురువారం వెల్లడించారు. అయితే ఈ ఎన్నికల్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తమ పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరేతో జరిగిన చర్చలో పార్టీ ఈ నిర్ణయానికి వచ్చిందని సంజయ్ రౌత్ వెల్లడించారు.


‘‘పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందా లేదా అని చాలా మంది ఆసక్తితో ఉన్నారు. వారికి నేనో విషయం స్పష్టం చేయదల్చుకున్నాను. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సూచనల మేరకు.. ప్రస్తుత తరుణంలో బెంగాల్‌లో దీదీ వర్సెస్ మిగతా మొత్తంగా ఉంది. అన్ని ‘ఎం’లు అంటే మనీ, మాఫియా, మీడియా అన్నీ మమతా బెనర్జీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటూ మమతా బెనర్జీకి గట్టి మద్దతుగా ఉండాలని శివసేన నిర్ణయించుకుంది. ఆమె సింహ గర్జన లాంటి విజయాన్ని సాధించాలని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే బెంగాల్‌ నిజమైన శివంగి మమతా బెనర్జీనే’’ అని సంజయ్ రౌత్ ట్వీట్ చేశారు.


ఎనిమిది విడతల్లో జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మార్చి 17 నుంచి ప్రారంభం కానున్నాయి. మే 2న ఫలితాలు విడుదల అవుతాయి. అయితే బెంగాల్‌లో ఎనిమిది విడతల పోలింగ్‌పై మమతా బెనర్జీ సహా అనేక మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. బెంగాల్‌తో పాటే ఎన్నికలు జరగనున్న తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు ఒకే విడత పోలింగ్ పెట్టి బెంగాల్‌కు మాత్రం 8 విడతల్లో పోలింగ్ పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. అంతే కాకుండా దీన్ని సవాల్ చేస్తూ ఒక లాయర్ సుప్రీంను ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14(సమానత్వపు హక్కు)కు ఇది పూర్తిగా భిన్నమైన చర్య అని సుప్రీంలో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంలో పిటిషన్‌దారు లాయర్ మనోహర్‌లాల్ శర్మ పేర్కొన్నారు.

Updated Date - 2021-03-04T21:02:34+05:30 IST