Abn logo
Oct 17 2021 @ 09:54AM

కరీంనగర్‌లో అద్భుతం.. షాకైన జనాలు.. వీడియోలు వైరల్!

కరీంనగర్ : జిల్లాలో అద్భుతం ఆవిష్కృతమైంది. లోయర్ మానేరు డ్యామ్ నుంచి నీరు ఆకాశంలోకి వెళ్లింది.! ఉత్తర అమెరికాలో వచ్చే టోర్నడోను పోలిన భారీ సుడిగాలి లాగా మానేరు డ్యామ్ నుంచి నీరు ఆకాశం వైపు వెళ్ళింది. ఈ దృశ్యాన్ని చూసిన జనాలు ఒకింత షాకయ్యారు. ఈ విషయం ఆ నోటా.. ఈ నోటా పాకడంతో అద్భుతాన్ని చూడటానికి జనాలు ఎగబడ్డారు. మానేరు జలాశయం పరిసర ప్రాంతాల్లో వరి పంట దగ్గర పనులు చేస్తున్న రైతులు మొదట ఈ దృశ్యాన్ని చూశారు. జనాలు ఈ అద్భుతాన్ని తమ ఫోన్ కెమెరాల్లో బంధించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2016 సంవత్సరంలోనూ ఇలాంటి దృశ్యమే కనువిందు చేసింది. ఐదేళ్ల తర్వాత మానేరు డ్యామ్ నుంచి మరోసారి టోర్నడోలాగా నీరు పైకి వెళ్ళింది.