తొమ్మిది నెలల విరామం అనంతరం సినీ రంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. సుదీర్ఘ కాలం మూతబడిన సినిమా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో క్రిస్మస్ నుంచి థియేటర్ల వద్ద సందడి మొదలుకాబోతోంది. భారతీయ చిత్రాలు మాత్రమే కాకుండా హాలీవుడ్ సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. 2017 సూపర్‌హిట్ చిత్రం `వండర్ వుమెన్` సీక్వెల్ `వండర్ ఉమెన్ 1984` భారత్‌లో ఒకరోజు ముందుగానే విడుదల కాబోతోంది.
గాల్ గాడోట్ ప్రధాన పాత్రలో పాటీ జెంకిన్స్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగా ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అదే రోజు డిజిటల్ ప్లాట్‌ఫామ్ మీద కూడా విడుదలవుతోంది. అంతకు ఒక రోజు ముందు అంటే 24న భారత్‌లో రిలీజ్ అవుతోంది.