చనిపోయిన వారికి ఉద్యోగాలు.. జీతం!.. వెలుగులోకి స్కామ్!

ABN , First Publish Date - 2020-09-03T01:01:29+05:30 IST

భారత్‌లో నిరుద్యోగిత పెరిగిపోతోందని ఓ పక్క సర్వేలు చెప్తుంటే.. గుజరాత్‌లో మాత్రం చనిపోయిన వారికి కూడా ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అర్థం కాలేదా? అయితే ఇది చదవాల్సిందే.

చనిపోయిన వారికి ఉద్యోగాలు.. జీతం!.. వెలుగులోకి స్కామ్!

అహ్మదాబాద్: భారత్‌లో నిరుద్యోగిత పెరిగిపోతోందని ఓ పక్క సర్వేలు చెప్తుంటే.. గుజరాత్‌లో మాత్రం చనిపోయిన వారికి కూడా ఉద్యోగాలు దొరుకుతున్నాయి. అర్థం కాలేదా? అయితే ఇది చదవాల్సిందే. గుజరాత్‌లోని బానస్కంత ప్రాంతంలో ఓ ఐదుగురికి కేంద్ర ప్రభుత్వ పథకం ఎమ్‌జీఎన్ఆర్ఈజీఏ కింద ఉద్యోగాలు లభించాయి. వీరంతా జీతాలు కూడా తీసుకుంటున్నారు. 


కాకపోతే దీనిలో ఓ పెద్ద ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఈ ఐదుగురూ 2016-19 మధ్యకాలంలోనే మృతిచెందారు. బాలుంద్రా గ్రామంలో వడ్గం లెజిస్లేటర్ జిగ్నేష్ మేవానీ, స్థానిక యాక్టివిస్ట్ కిరణ్ పార్మర్ ఈ స్కామ్‌ను బయటపెట్టారు. ‘ఇలా పేదల డబ్బును చాలాకాలంగా అధికారులు దోచుకుంటున్నారు. వీరిని కచ్చితంగా శిక్షించాల్సిందే’ అని మేవానీ పేర్కొన్నారు.

Updated Date - 2020-09-03T01:01:29+05:30 IST