Abn logo
Sep 19 2021 @ 00:54AM

వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు స్థల పరిశీలన

పి.గన్నవరం, సెప్టెంబరు 18: కోనసీమలో వృత్తి నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటుకు కలెక్టర్‌ ఆదేశాలతో స్థల పరిశీలన చేసినట్లు జేసీ లక్ష్మీశ పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుతో కలిసి పలుచోట్ల స్థల పరిశీలన చేసి అనంతరం మాట్లాడారు. రూ.50కోట్లతో వృత్తి నైపుణ్యకేంద్రం నిర్మాణం చేస్తారని తెలిపారు. పోతవరంలో ఉన్న 1.41ఎకరాలతో పాటు పి.గన్నవరంలో ఉన్న ప్రభుత్వ భూములను  గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆయన స్థానిక అధికారులకు సూచించారు. అనంతరం ముంగండపాలెం, కారుపల్లి, పోతవరం, పి.గన్నవరం గ్రామాల్లో ప్రభుత్వ భూములను జేసీ పరిశీలించారు.  నివేదికను కలెక్టర్‌కు వివరించనున్నట్లు ఆయన తెలిపారు. ఆయన వెంట ఆర్‌.ఏనుగుపల్లి సర్పంచ్‌ దొమ్మేటి పార్వతి, ఆర్‌ఐ జి.సుబ్రహ్మణ్యం, సిబ్బంది ఉన్నారు.