కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’

ABN , First Publish Date - 2021-05-08T09:09:58+05:30 IST

కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగులు ఇంటి నుంచే విధులు (వర్క్‌ ఫ్రమ్‌ హోం)నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్‌ ఫ్రమ్‌ హోం’

గర్భిణులు, దివ్యాంగ ఉద్యోగులకు చాన్స్‌

కట్టడి జోన్లలో ఉండేవారికీ వెసులుబాటు


న్యూఢిల్లీ, మే7 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి ఉధృతి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంలోని కొన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగులు ఇంటి నుంచే విధులు (వర్క్‌ ఫ్రమ్‌ హోం)నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ (డీవోపీటీ) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర ఉద్యోగుల్లో ప్రధానంగా గర్భిణులు, దివ్యాంగులు 

మిగతా 14వ పేజీలోపూర్తిగా తమ ఇళ్ల నుంచే విధులు నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. అలాగే కంటైన్మెంట్‌ జోన్లలో నివసిస్తున్న కేంద్ర ఉద్యోగులు, అధికారులు కూడా ఇంటి నుంచే పని చేసేలా వెసులుబాటు కల్పించారు. వర్క్‌ ఫ్రమ్‌ హోం అవకాశం కేంద్ర ప్రభుత్వశాఖలు, కేంద్రప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే గ్రూప్‌-బీ, గ్రూప్‌-సీ స్థాయి ఉద్యోగులకు వర్తిస్తాయని డీఓపీటీ పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే ఉద్యోగులు, అధికారులు కొవిడ్‌-19 మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.


ఉద్యోగులకు వర్క్‌ ఫ్రమ్‌ హోం వెసులుబాటు ఉత్తర్వులు ఈ నెల  31 వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది.  ఇదిలావుంటే  కరోనా విజృంభణ నేపథ్యంలో కొన్ని కేటగిరీల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు గత ఏప్రిల్‌ 19 నుంచే  ఇంటి నుంచి విధులు నిర్వహిస్తున్నారు. తాజాగా మరికొన్ని కేటగిరీల ఉద్యోగులకు ఈ వెసులుబాటు కల్పించారు. 

Updated Date - 2021-05-08T09:09:58+05:30 IST