సమన్వయంతో పనిచేయాలి

ABN , First Publish Date - 2022-09-05T05:36:33+05:30 IST

ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో సమిష్టిగా పని చేయడమే సంస్థ అభివృద్ధికి దోహదం చేస్తుందని ఓసీపీ-3 ప్రాజెక్టు మేనేజర్‌ రమేష్‌ పేర్కొన్నారు.

సమన్వయంతో పనిచేయాలి
రామ్మూర్తిని సన్మానిస్తున్న ఓసీపీ-3 అధికారులు, సూపర్‌వైజర్లు

యైటింక్లయిన్‌కాలనీ, సెప్టెంబరు 4: ఉద్యోగులు, అధికారులు సమన్వయంతో  సమిష్టిగా పని చేయడమే సంస్థ అభివృద్ధికి దోహదం చేస్తుందని ఓసీపీ-3 ప్రాజెక్టు మేనేజర్‌ రమేష్‌ పేర్కొన్నారు. ఆదివారం ప్రాజెక్టు ఆవరణలో ఉత్తమ సూపర్‌వైజర్‌ మాదాసి రామ్మూర్తి అభినందన సభ జరిగింది. అధికారులు, సూపర్‌వైజర్లు, ఉద్యోగులు రామ్మూర్తిని సన్మానించారు. ఈసందర్భంగా మేనేజర్‌ మాట్లాడారు. సింగరేణిలో సూపర్‌వైజర్ల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. కార్మికులు, అధికారుల మధ్య వారధిగా పనిచేస్తూ సమన్వయం చేసుకుంటూ ఉత్పత్తి లక్ష్యాల సాధనకు పనిచేయడం అవసరమని సూచించారు. సూపర్‌వైజ ర్లలో నాయకత్వ లక్షణాలు, సవాళ్ళను అధగమించే లౌక్యం ఎంతో అవసరమని అన్నారు. చిత్తశుద్ధి, నైపుణ్యం గల ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నా రు. దేశంలోనే ప్రతిష్టాత్మక సంస్థగా నిలుస్తున్న సింగరేణిలో పనిచేయడం గర్వ కారణమని మేనేజర్‌ రమేష్‌ పేర్కొన్నారు. చల్లా రవీందర్‌రెడ్డి అధ్యక్షతన జరి గిన ఈ కార్యక్రమంలో అధికారులు భరత్‌కుమార్‌, ఎం శ్రీనివాస్‌, కత్రేషన్‌, మనోజ్‌కుమార్‌, పాపయ్య, పిట్‌ సెక్రెటరీ బేతి చద్రయ్య, ఆకుల రాజయ్య, మైనింగ్‌ స్టాఫ్‌ సిబ్బంది శ్రీనివాస్‌, మల్లారెడ్డి, మొగిలి, శ్రీనివాసరెడ్డి, తాజుద్దీన్‌, శ్రీకాంత్‌, బండ కృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-05T05:36:33+05:30 IST