హిందీలోకి సాంకేతిక, ఫార్మాస్యూటికల్ విద్య అనువాదం: అమిత్‌షా

ABN , First Publish Date - 2021-08-11T01:26:06+05:30 IST

దేశ అధికార భాష హిందీకి ప్రధాని నరేంద్ర మోదీ తగిన గౌరవం కల్పిస్తున్నారని, వివిధ..

హిందీలోకి సాంకేతిక, ఫార్మాస్యూటికల్ విద్య అనువాదం: అమిత్‌షా

న్యూఢిల్లీ: దేశ అధికార భాష హిందీకి ప్రధాని నరేంద్ర మోదీ తగిన గౌరవం కల్పిస్తున్నారని, వివిధ కార్యక్రమాల్లోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపైనా హిందీలో ప్రసంగిస్తూ అధికార భాష ఔన్నత్యాన్ని చాటుతున్నారని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. ప్రధాని మోదీ సారథ్యంలో సాంకేతిక విద్య, ఫ్యార్మాస్యూటికల్ విద్యకు చెందిన పాఠ్యాంశాలను అధికార భాషలోకి అనువదించే కార్యక్రమం ప్రారంభమైనట్టు ప్రకటించారు. అధికార భాషపై పార్లమెంటరీ కమిటీ 37వ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు.


అధికార భాషా చట్టం-1963 కింద చట్టం అమల్లోకి వచ్చిన పదేళ్ల తర్వాత కమిటీ ఏర్పాటు చేయాలని సెక్షన్ 3 పేర్కొంటోంది. 1976లో చట్టంలోని సెక్షన్ 4 కింద కమిటీ ఏర్పడింది. కమిటీలో 30 మంది పార్లమెంటు సభ్యులుంటారు. వీరిలో 20 మంది లోక్‌సభకు చెందిన వారు కాగా, 10 మంది రాజ్యసభకు చెందిన వారు. ప్రభుత్వ అధికార కార్యక్రమాల్లో హిందీ భాష వినియోగంపై  ప్రగతిని ఈ కమిటీ సమీక్షించాల్సి ఉంటుంది. అధికార భాషా విధానం, రాజ్యాంగ నిబంధనలు, తీర్మానాలు, నిబంధనలు, రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన వివరాలను యూజర్లు తెలుసుకునే వీలుంటుంది.

Updated Date - 2021-08-11T01:26:06+05:30 IST