ఉపాధి హామీ నిధుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-08-11T22:34:11+05:30 IST

ఉపాధి హామీ నిధుల చెల్లింపునకు సంబంధించిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. కేంద్రం తరఫున కౌంటర్ దాఖలు చేయడానికి హైకోర్టును అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ సమయం...

ఉపాధి హామీ నిధుల చెల్లింపుపై హైకోర్టులో విచారణ

అమరావతి: ఉపాధి హామీ నిధుల చెల్లింపునకు సంబంధించిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. కేంద్రం తరఫున కౌంటర్ దాఖలు చేయడానికి హైకోర్టును అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ సమయం కోరారు. పిటిషన్లు అన్నీ ఒకేసారి విచారణ జరుపుతామని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈలోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-08-11T22:34:11+05:30 IST