పని ఒత్తిడి తగ్గించాలి

ABN , First Publish Date - 2022-02-08T05:53:31+05:30 IST

తమపై పని ఒత్తిడిని తగ్గించాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్‌ చేశారు.

పని ఒత్తిడి తగ్గించాలి
కలెక్టర్‌ కార్యాలయానికి ర్యాలీగా బయలు దేరిన పంచాయతీ కార్యదర్శులు

- పంచాయతీ కార్యదర్శుల డిమాండ్‌ 

- డీపీవో, కలెక్టర్‌ కార్యాలయాల ముందు ఆందోళన


గద్వాల, ఫిబ్రవరి 7: తమపై పని ఒత్తిడిని తగ్గించాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్‌ చేశారు. పని ఒత్తిడిని భరించలేక మహబూబాబాద్‌ పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్‌ ఆత్మహత్య ఘటనపై విచారం వ్యక్తం చేశారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిం చారు. జిల్లా కేంద్రంలోని డీపీవో, కలెక్టర్‌ కార్యాలయాల ముందు నిరసన వ్వక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యదర్శులు పని ఒత్తిడిని భరిం చలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్వక్తం చేశారు. ఇకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు మానవతా దృక్ఫథంతో ఆలోచించి పని ఒత్తిడిని తగ్గించాలని కోరారు. జేపీఎస్‌లను రెగ్యులరైజ్‌ చేయాలని, డీఎస్‌ఆర్‌ విధానాన్ని రద్దు చేయాలని, ఉపాధిహామీ పథకం అమలుకు సహాయకులను నియమించుకునేం దుకు అనుమతించాలని కోరారు. అదే విధంగా వాట్సాప్‌ ద్వారా సందేశాలకు స్వస్తి పలికి సర్క్యులర్‌ ద్వారా ఇవ్వాలని కోరారు. సరైన సమయంలో నిధులు విడుదల కాక ఖర్చుల కోసం తమ వేతనం నుంచి భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం డీపీవో శ్యాంసుందర్‌, అదనపు కలెక్టర్‌ శ్రీహర్షలకు వినతిపత్రం అందించారు. 

Updated Date - 2022-02-08T05:53:31+05:30 IST