ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేశా

ABN , First Publish Date - 2020-05-24T10:24:31+05:30 IST

ఏడాది కాలంలో రాష్ట్రంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ నామ నాగేశ్వరరావు

ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేశా

ఏడాదిలో ఎన్నో అంశాలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లా 

ఖమ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు


ఆంధ్రజ్యోతిప్రతినిధి-ఖమ్మం, మే 23: ఏడాది కాలంలో రాష్ట్రంతోపాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు ఎంపీ నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఏడాది కాలంలో టీఆర్‌ఎస్‌లోక్‌సభా పక్ష నేతగా ఖమ్మం ఎంపీగా చేపట్టి కార్యక్రమాలను ఎంపీ నామ తన క్యాంపు కార్యాలయం నుంచి ఓ ప్రకటన ద్వారా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయహోదా, విభజన చట్టం అమలు విషయంలో బయ్యారం ఉక్కుపరిశ్రమ, కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు, భద్రాచలం-కొవ్వూరు రైల్వేలైన్‌ పనులు వేగతరం చేయాలని, భద్రాచలం -సారపాకవైపు రైల్వేలైన్‌ ఏర్పాటుచేసే భద్రాచలం వెళ్లేభక్తులకు సౌకర్యం కలిపించాలని సూచించినట్టు తెలిపారు.


తెలంగాణ రాష్ట్రానికి జీఎస్టీ కింద రావాల్సిన రూ.4,530కోట్లు విడుదల గురించి వెనుకబడినప్రాంతాల అభివృద్ధికి రూ.450కోట్ల రాష్ట్రానికి విడుదలయ్యేలా కృషిచేశానని వివరించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి పీఎంజీఎస్‌వై కింద నిధుల కేటాయింపుతపాటు పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఓటువేసి మైనారిటీలకు అండగా నిలిచానన్నారు. రాష్ట్రంలో ఐదు ప్రధాన జాతీయ రహధారులకు పరిపాలన మంజూరుచేయడం జరిగిందని ఇందులో మహబాద్‌నుండి ఇల్లెందుమీదుగా కొత్తగూడెం రహదారి కూడా ఉందని వివరించారు.


భారత్‌ మాల పరియోజన కింద ఖమ్మం-కోదాడ నాలుగులైన్లరహదారి పనులు పూర్తి చేయాలని కేంద్రాన్ని కోరానన్నారు. మధిరలో నూతన రైల్వేఅండర్‌బ్రిడ్జి ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. కొత్తగూడెం సిర్పూర్‌కాగజ్‌నగర్‌ రైలు పునఃప్రారంభానికి కృషి చేశానన్నారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌లో ఎస్కులేటర్‌, సీసీ కెమేరాల ఏర్పాటు, పీఎంజీఎస్‌వై కింద రహదారులకు ప్రతిపాదనలు చేశాన్నారు. ఖమ్మంలోక్‌సభ నియోజకవర్గంపరిధిలో ఉపాధి హామీపథఖంలో కొత్త రోడ్లు మంజూరచేయించడం జరిగిందని, ముఖ్యమంత్రి సహాయనిధికి 180మంది కోటిరూపాయల ఆర్థిక సహాయం, నియోజకవర్గంలో 4,580మందికి ఇజ్జత్‌ పాసులు ఇప్పించినట్లు తెలిపారు. 

Updated Date - 2020-05-24T10:24:31+05:30 IST