Abn logo
Sep 22 2021 @ 23:22PM

సమ్మెలో కార్మికులు.. వీధుల్లో చెత్త

యంత్రంతో చెత్త ఎత్తుతున్న దృశ్యం

పలాస : పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో పారిశుధ్య కార్మికులు  మూడు రోజులుగా సమ్మెలో పాల్గొంటు న్నారు. దీంతో వీధుల్లో చెత్త పేరుకు పోవడంతో పర్మినెంట్‌ పారిశుధ్య సిబ్బంది చెత్త తరలి స్తున్నారు. సిబ్బంది తక్కువగా ఉండడంతో మునిసిపాలిటీ ఎక్స్‌కవేటర్‌తో చెత్త ఎత్తుతున్నారు. మునిసిపాలిటీలోని 31 వార్డుల్లో రోజుకు 35 టన్నుల చెత్తను ఎప్పటికప్పు డు సిబ్బంది సేకరించి డంపింగ్‌ యార్డులకు తరలిస్తుంటారు. కార్మికులు సమ్మెలో ఉండడంతో వీధులు మురికి కూపాలుగా మారిపోయాయి.