కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదు

ABN , First Publish Date - 2021-10-25T06:20:52+05:30 IST

తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా కూడా రాష్ట్రంలో కా ర్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులచే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.

కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదు
మధ్యాహ్న భోజన కార్మికుల దీక్షకు మద్దతు ప్రకటిస్తున్న చాడ వెంకట్‌రెడ్డి

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబర్‌ 24: తెలంగాణ రాష్ట్రం సిద్ధించినా కూడా రాష్ట్రంలో కా ర్మికుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులచే పెద్దఎత్తున ఉద్యమం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఐదు రోజులుగా పెద్దపల్లిలోని తెలంగాణ అమర వీరుల స్తూపం వద్ద రిలే నిరాహార దీక్ష చేస్తున్న మధ్యాహ్నా భోజనం పథకం కార్మికుల దీక్షా శిబిరాన్ని ఆదివారం చాడ వెంకట్‌రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వారికి మద్దతు పలికిన అనంతరం మా ట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు, అసంఘటిత కార్మికులకు ఉద్యోగ భ ద్రత కరువయ్యిందన్నారు. వారి సంక్షేమం కోసం ఈ ప్రభుత్వాలు ఏమాత్రం పట్టిం చుకోవడం లేదన్నారు. మధ్యాహ్న భోజన పథకం ఆరంభమైనప్పటి నుంచి నిర్వాహ కులు వెట్టిచాకిరి చేస్తున్నారన్నారు. నెలకు గౌరవ వేతనంగా కేవలం వెయ్యి రూపా యలు మాత్రమే ఇస్తున్నారన్నారు. మార్కెట్‌లో నిత్యావసర ధరలు పెరిగినా కూడా వడ్డన చార్జీలు పెంచడం లేదన్నారు. కోడిగుడ్లకు కేవలం 5 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజన కార్మికులు ఎంతగా పోరాటంచేస్తున్నా కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వాలు వారికి ఇచ్చే గౌరవ వేత నాలను పెంచుతారని ఆశతో ఉన్నారన్నారు. ఉపాధిహామీ కూలీ పనులకు వెళ్లినా కూడా నెలకు 4 వేలకు తక్కువ రావన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థు లు నిరుపేద కుటుంబాలకు చెందినవారేనన్నారు. వారికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు తమకు ఎంత కష్టం వచ్చినా కూడా పథకాన్ని కొనసాగిస్తున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మధ్యా హ్న భోజన పథకం కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం, ఏఐ టీయూసీ నాయకులు కడారి సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T06:20:52+05:30 IST