కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి

ABN , First Publish Date - 2021-06-23T06:38:59+05:30 IST

పత్తి కార్మికులకు సామాజిక భద్రత, గౌరవ ప్రదమైన వృత్తి కల్పించాలని ఏటీయూసీ జాతీయ నాయులు ఉజ్జిని రత్నాకర్‌రావు కోరారు.

కార్మికులకు సామాజిక భద్రత కల్పించాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఐటీయూసీ జాతీయ నాయకులు ఉజ్జిని రత్నాకర్‌రావు

ఏఐటీయూసీ జాతీయ నాయకుడుఉజ్జిని రత్నాకర్‌రావు

నల్లగొండ రూరల్‌, జూన్‌ 22 : పత్తి కార్మికులకు సామాజిక భద్రత, గౌరవ ప్రదమైన వృత్తి కల్పించాలని ఏటీయూసీ జాతీయ నాయులు ఉజ్జిని రత్నాకర్‌రావు కోరారు. పట్టణంలోని ఏఐటీ యూసీ కార్యాలయంలో మంగళవారం ఐఎల్‌వో, ఏఐటీయూసీ జిల్లా వర్క్‌షాప్‌ నిర్వహించారు. ఈ ఆయన మాట్లాడుతూ  కార్మి కుల హక్కుల పరిరక్షణ కోసం ఇంటర్నేషనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పత్తి ఉత్పత్తిలో భాగస్వా మ్యం అయ్యే కార్మికులు, చిన్న సన్నకారు రైతుల జీవన విధా నంపై, సమస్యలపై అధ్యయనం కోసం ఐఎల్‌ఓ సహకారంతో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం సమగ్ర చట్టాలను రూపొందిం చాల్సిన అవసరం ఉందని తెలిపారు. సంఘం జిల్లా అధ్యక్షుడు నలప రాజు సతీష్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కలకొండ కాంతయ్య,  ఏఐటీ యూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్‌రెడ్డి,  వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొలుగురి నరసింహ, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చాపల శ్రీను,  నూనె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

 మునుగోడు రూరల్‌ : పత్తి రైతులకు సామాజిక న్యాయం, గౌరవప్రదమైన పని కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నారు. మండలంలోని సోలిపురం గ్రామంలో ఏఐటీయూసీ, ఐఎల్‌వో ఆధ్వర్యంలో పత్తి రైతులకు మంగళవారం అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ నకిరేకంటి పద్మయాదయ్య చాపల శ్రీను, చలపతి,  దుబ్బ వెంకన్న, ఉపసర్పంచ్‌ రాజయ్య పాల్గొన్నారు.

Updated Date - 2021-06-23T06:38:59+05:30 IST