Abn logo
Sep 24 2021 @ 15:35PM

మహిళా పోలీసులకు పని వేళల తగ్గింపు

ముంబై: పోలీస్ ఫోర్స్‌లోని మహిళా సిబ్బందికి 8 గంటల పని వేళలను అమలు చేయనున్నట్టు మహారాష్ట్ర డీజీపీ సంజయ్ పాండే శుక్రవారంనాడు ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే దీనిని అమలు చేస్తున్నామని, ఇవే పనివేళలను త్వరలో దశల వారిగా రాష్ట్రమంతటా అమల్లోకి తెస్తామని చెప్పారు. కాగా, 12 గంటల నిర్దిష్ట పనివేళలకు మించి తమతో తరచు పనిచేయించుకుంటున్నారని, ఈ ప్రభావం తమ కుటుంబ బాధ్యతల నిర్వహణపై పడుతోందని పలువురు మహిళా కానిస్టేబుళ్ల ఇటీవల డీజీపీ దృష్టికి తెచ్చినట్టు ఒక అధికారి తెలిపారు. ఈ క్రమంలోనే 12 గంటలకు బదులు 8 గంటల పనివేళలు తెచ్చే విషయమై సీనియర్ అధికారులతో పాండే చర్చించారు. నాగపూర్, పుణె, అమరావతి, నవీ ముంబైలలో ఇప్పటికే 8 గంటల పనివేళలను విజయవంతంగా అమల్లోకి తెచ్చారు. ఈ ప్రాంతాల్లో గరిష్ట స్థాయిలో పోలీసు సిబ్బంది అవసరం తరచు ఉంటుందని, అయితే ఈ నాలుగు మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో 8 గంటల పనివేళల విధానం విజయవంతమైనందున మరో నెలరోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానం అమల్లోకి వచ్చే అవకాలున్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

ఇవి కూడా చదవండిImage Caption