విరామం తరువాత... వ్యాయామం!

ABN , First Publish Date - 2021-05-05T05:30:00+05:30 IST

కిందటి ఏడాది కొవిడ్‌ కారణంగా జిమ్‌లు మూతపడ్డాయి. కొన్ని నెలల తరువాత తెరుచుకున్నా వైరస్‌ భయంతో జిమ్‌కు వెళ్ళడానికి ఎక్కువమంది సాహసించలేదు. ఇప్పుడు మరోసారి కరోనా విజృంభిస్తూ ఉండడంతో...

విరామం తరువాత... వ్యాయామం!

కిందటి ఏడాది కొవిడ్‌ కారణంగా జిమ్‌లు మూతపడ్డాయి. కొన్ని నెలల తరువాత తెరుచుకున్నా వైరస్‌ భయంతో జిమ్‌కు వెళ్ళడానికి ఎక్కువమంది సాహసించలేదు. ఇప్పుడు మరోసారి కరోనా విజృంభిస్తూ ఉండడంతో వ్యాయామశాలలు ఖాళీగా కనిపిస్తున్నాయి. దాదాపు సంవత్సరం నుంచి శరీర వ్యాయామానికి ఎందరో బ్రేక్‌ తీసుకున్నారు. ఈ సుదీర్ఘ విరామం తరువాత మళ్ళీ వ్యాయామంలోకి దిగాలంటే ఏం చేయాలి? ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి?


  1. శరీరం రొటీన్‌లో పడడానికి కొంత సమయం పడుతుంది. గతంలో మీరు అయిదు కిలోమీటర్లు పరిగెత్తి ఉండొచ్చు. కొన్ని యోగాసనాలు సులువుగా వెయ్యగలిగి ఉండొచ్చు. కానీ గ్యాప్‌ వచ్చింది కాబట్టి చిన్న స్థాయిలో ప్రారంభించండి. 
  2. వ్యాయామానికి రోజూ ఒక నిర్ణీత సమయం కేటాయించండి. అది పగలు కావచ్చు, సాయంత్రం కావచ్చు. ప్రతిరోజూ అదే సమయం పాటించండి. 
  3. ఇంట్లో ప్రశాంతంగా ఉండే ప్రదేశాన్ని ఎంచుకోండి. పరిసరాలు ఆహ్లాదంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోండి. 
  4. వ్యాయామం మధ్యలో బ్రేక్‌ తీసుకొని, పనులు చూసుకొని, మళ్ళీ కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఎంతసేపు చేయాలనుకుంటే అంతసేపు వ్యాయామంలో నిమగ్నం అవండి. 
  5. గ్యాప్‌ తరువాత వ్యాయామం చేస్తున్నప్పుడు కండరాలు, కీళ్ళలో నొప్పులు రావచ్చు. మరీ ఎక్కువ ఇబ్బందిగా ఉంటే తప్ప రోజువారీ ఎక్సర్‌సైజ్‌ మానకండి. 
  6. పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం తీసుకోండి. నీరు ఎక్కువగా తాగండి. ఆహారంలో పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.

Updated Date - 2021-05-05T05:30:00+05:30 IST