చకచకా ఆధునికీకరణ

ABN , First Publish Date - 2020-06-06T10:39:59+05:30 IST

కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎ్‌స) ఐదోదశ రెన్నోవేషన్‌ అండ్‌ మోడర్నైజేషన్‌(ఆర్‌అండ్‌ఎం) పనులకు ముహూర్తం కుదిరింది. కర్మాగారంలోని

చకచకా ఆధునికీకరణ

కేటీపీఎస్‌ ఆర్‌అండ్‌ఎంనకు కుదిరిన ముహూర్తం

45 రోజుల పాటు సాగనున్న పనులు

వివిధ ప్రాంతాల నుంచి నిపుణుల రాక

ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’


పాల్వంచ, జూన్‌ 5: కొత్తగూడెం థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (కేటీపీఎ్‌స) ఐదోదశ రెన్నోవేషన్‌ అండ్‌ మోడర్నైజేషన్‌(ఆర్‌అండ్‌ఎం) పనులకు ముహూర్తం కుదిరింది. కర్మాగారంలోని 9, 10 యూనిట్ల ఆధునికీకరణకు జెన్‌కో రూ.100 కోట్లు కేటాయించింది. కానీ కేటీపీఎస్‌ ఏడోదశ, కోవిడ్‌-19 కరోనా సమస్యలతో ఆరు నెలలు ఆలస్యంగా పనులను ప్రారంభించాల్సి వచ్చింది. ముందుగా 250 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన తొమ్మిదో యూనిట్‌లో 45 రోజుల పాటు పనులు చేపట్టనున్నారు. ఇందుకోసం గురువారం రాత్రి యూనిట్‌ నుంచి విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేశారు. బాయిలర్‌ వేడి తగ్గిన తరువాత దానిని తెరిచి పనుల్లో నిమగ్నమవుతారు. 


రెండు యూనిట్లకు రూ.100కోట్లు

500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఈ కర్మాగారంలోని రెండు యూనిట్లు(9,10) దఫదఫాలుగా ఆధునికీకరించాలని జెన్‌కో 2019లోనే నిర్ణయించింది. ఇందుకోసం సంస్థ రూ.100 కోట్లను కేటాయించింది. గత ఏడాది అక్టోబర్‌ లోనే ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. కే టీపీఎస్‌ కాంప్లెక్స్‌లోని 800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ఏడోదశను వార్షిక మరమ్మతుల కోసం నిలిపివేయడంతో పనులు చేపట్టలేదు. 

 

పనులకు పలు ప్రాంతాల నుంచి నిపుణుల రాక

ఐదోదశ ఆధునికీకరణ పనులకు చెన్నై, పూనె, బెంగళూర్‌, హరిద్వార్‌ తదితర ప్రాంతాల నుంచి నిపుణులు రానున్నారు. ఈ. కర్మాగారంలోని ఎయిర్‌ హీటర్‌ ప నులను చెన్నై నిపుణులు, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ కంట్రోల్‌ బోర్డు పనులను బెంగుళూ రుకు చెందిన నిపుణులు, కోల్‌ప్లాంట్‌ పనులను పూనెకు చెందిన నిపుణులు చేపట్టనున్నారు. 45 రోజుల పాటు నిర్వహించే తొమ్మిదో యూనిట్‌ పనులు చేసేందుకు బీహెచ్‌ఈఎల్‌ ఆధీనంలో బిహార్‌, జార్ఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ తదితర ప్రాంతాల నుంచి కార్మికులు రానున్నారు.


ప్యానల్స్‌ను తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చనున్నారు. వీటిలో ప్రధాన భాగాలయిన ఎయిర్‌హీటర్‌ను సు మారు రూ.15 కోట్లు, కంట్రోల్‌ ఇనుస్ట్రుమెంటేషన్‌ను రూ.70 కోట్లతో ఆధునికీకరించనున్నారు. సుమారు 100మంది టెక్నీషియన్లు, ఇంజనీర్లు ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. జూన్‌ ఒకటి నుంచే పనులు చేసుకునేందుకు జెన్‌కో అధికారులు అనుమతి ఇవ్వగా నాలుగు రోజులు ఆలస్యంగా యూనిట్‌ నుంచి ఉత్పత్తిని నిలిపివేసి సమాయత్తమయ్యారు.


15రోజుల క్రితమే చెప్పిన ఆంధ్రజ్యోతి

పనులపై గతనెల 21వ తేదీనే ‘ఆధునీకరణలో హైరానా’ పేరిట కఽథనం ప్రచురితమయింది. పనుల జాప్యంపై జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఆరా తీసినట్టు సమాచారం.

Updated Date - 2020-06-06T10:39:59+05:30 IST