Abn logo
Sep 24 2021 @ 03:51AM

లివ్‌ ద గేమ్‌.. లవ్‌ ద గేమ్‌

వరల్డ్‌కప్‌ ప్రచార వీడియో విడుదల 

దుబాయ్‌: త్వరలో జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌ సందర్భంగా థీమ్‌ సాంగ్‌ ‘లివ్‌ ద గేమ్‌’ను ఐసీసీ గురువారం విడుదల చేసింది. ఇందులో విరాట్‌, కీరన్‌ పొలార్డ్‌, మ్యాక్స్‌వెల్‌, అఫ్ఘాన్‌ యువకెరటం రషీద్‌ ఖాన్‌ల యానిమేషన్‌ క్యారెక్టర్లు ఆకట్టుకున్నాయి. 16 దేశాలు పాల్గొంటున్న పొట్టి వరల్డ్‌కప్‌ అక్టోబరు 17నుంచి నవంబరు 14న దుబాయ్‌లో జరిగే  ఫైనల్‌తో ముగుస్తుంది.  ‘లివ్‌ ద గేమ్‌.. లవ్‌ ద గేమ్‌’ థీమ్‌తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నట్టు ఈ వీడియోలో చిత్రీకరించారు. మెగా ఈవెంట్‌లో పాల్గొనే జట్ల జెర్సీలు, జాతీయ జెండాలను కూడా చూపించారు. 3డి, 2డి ఎఫెక్ట్స్‌తో సరికొత్త సాంకేతికను ఉపయోగించి నిర్మించిన యానిమేటెడ్‌ ఫిల్మ్‌లో కోహ్లీ, పొలార్డ్‌, మ్యాక్స్‌వెల్‌, రషీద్‌ ‘అవతార్‌’ యానిమేషన్‌ క్యారెక్టర్లతో గ్రౌండ్‌లో వరల్డ్‌కప్‌ కోసం పోటీపడుతున్నట్టు రూపొందించారు.