T20 world cup semifinal:పాకిస్థాన్ జట్టుకు పెద్ద దెబ్బ

ABN , First Publish Date - 2021-11-11T14:08:10+05:30 IST

టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు ముందే పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది....

T20 world cup semifinal:పాకిస్థాన్ జట్టుకు పెద్ద దెబ్బ

ఇద్దరు స్టార్ క్రికెటర్లకు ఫ్లూ, కరోనా నెగిటివ్ అని పరీక్షల్లో నిర్ధారణ


దుబాయ్ : టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌కు ముందే పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు పెద్ద దెబ్బ తగిలింది. ఫ్లూ కారణంగా సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ షోయబ్ మాలిక్, ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఇద్దరూ ప్రాక్టీస్‌కు రాలేదు. వారిద్దరికీ కొవిడ్-19 నెగిటివ్ అని తేలింది. స్టార్ క్రికెటర్లు ఇద్దరూ విశ్రాంతి తీసుకోవాలని డాక్టరు సూచించారు.గురువారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం వారి భాగస్వామ్యంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.గురువారం దుబాయ్‌లో జరగనున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 పోటీల్లో ఆస్ట్రేలియాతో  సెమీఫైనల్ పోరుకు  షోయబ్ మాలిక్, మహ్మద్ రిజ్వాన్‌లు ఇద్దరూ దూరమయ్యే అవకాశం ఉంది.


రిజ్వాన్, మాలిక్‌ ఇద్దరూ పాకిస్థాన్ బ్యాటింగ్ యూనిట్‌లో కీలకమైన భాగం. ముఖ్యంగా అటాకింగ్ ఓపెనర్ రిజ్వాన్ ప్రపంచ కప్‌లో ఐదు గేమ్‌లలో 214 పరుగులు చేశాడు.మరోవైపు షోయబ్ మాలిక్ ఈ టోర్నమెంట్‌లో వివిధ దశల్లో మెరుగైన ఆట ప్రదర్శించాడు. మిడిల్ ఆర్డర్‌లో మాలిక్ కీలకమైన పరుగులు చేశాడు. అతను స్కాట్లాండ్‌పై కేవలం 18 బంతుల్లో 50 పరుగులు చేశాడు.తమ కీలక బ్యాటర్లు ఇద్దరూ మార్క్యూ మ్యాచ్‌కి అందుబాటులో ఉంటారని పాకిస్థాన్ భావిస్తోంది. మాలిక్, రిజ్వాన్‌ల స్థానంలో సర్ఫరాజ్ అహ్మద్,  హైదర్ అలీలు జట్టులో చేరవచ్చు. ప్రస్థుతం జరుగుతున్న టోర్నమెంట్‌లో బాబర్ అజామ్ నేతృత్వంలోని పాకిస్థాన్ మాత్రమే ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా నిలిచింది.


Updated Date - 2021-11-11T14:08:10+05:30 IST