ప్రపంచ వృద్ధి -1 శాతం : ఐక్యరాజ్య సమితి

ABN , First Publish Date - 2020-04-03T05:57:55+05:30 IST

కరోనా ధాటికి ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు -1 శాతానికి క్షీణించవచ్చని ఐక్యరాజ్య సమితి(యూఎన్‌) తాజా నివేదిక హెచ్చరించింది. గతంలో పేర్కొన్న 2.5 శాతం వృద్ధితో పోలిస్తే అంచనాను ఏకంగా రుణాత్మక స్థాయికి...

ప్రపంచ వృద్ధి  -1 శాతం :  ఐక్యరాజ్య సమితి

కరోనా ధాటికి ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు -1 శాతానికి క్షీణించవచ్చని ఐక్యరాజ్య సమితి(యూఎన్‌) తాజా నివేదిక హెచ్చరించింది. గతంలో పేర్కొన్న 2.5 శాతం వృద్ధితో పోలిస్తే అంచనాను ఏకంగా రుణాత్మక స్థాయికి కుదించింది. కరోనా కట్టడి కోసం ఆర్థిక కార్యకలాపాలపై ఆంక్షలు దీర్ఘకాలం పాటు కొనసాగితే ప్రపంచ వృద్ధి రేటు తాజా అంచనాలకు మించి  పతనమయ్యే ప్రమాదం ఉందని ఐక్యరాజ్య సమితి అంటోంది. కరోనా దెబ్బకు దాదాపు 100 దేశాలు తమ సరిహద్దుల్ని మూసేశాయి. దాంతో అంతర్జాతీయ పర్యాటకం పూర్తిగా స్తంభించిపోయింది. ఈ దేశాల్లోని కోట్లాది మంది ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని యూఎన్‌ పేర్కొంది. 

Updated Date - 2020-04-03T05:57:55+05:30 IST