'తానా' ఆధ్వర్యంలో 14వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం

ABN , First Publish Date - 2021-06-22T20:31:09+05:30 IST

ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 27న‌(ఆదివారం) ఉభయ తెలుగు రాష్ట్రేతర విశ్వవిద్యాలయాలలో “తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా వికాసం” మరియు “సాహితీవేత్తల జీవితాల్లో హాస్యం” అనే అంశంపై 14వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో జ‌ర‌గ‌నుంది.

'తానా' ఆధ్వర్యంలో 14వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశం

డ‌ల్లాస్‌, టెక్సాస్‌: ఉత్త‌ర అమెరికా తెలుగు సంఘం(తానా) ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 27న‌(ఆదివారం) ఉభయ తెలుగు రాష్ట్రేతర విశ్వవిద్యాలయాలలో “తెలుగు భాష, సాహిత్య, పరిశోధనా వికాసం” మరియు “సాహితీవేత్తల జీవితాల్లో హాస్యం” అనే అంశంపై 14వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో జ‌ర‌గ‌నుంది. భారత కాలమానం ప్ర‌కారం ఆదివారం రాత్రి 8:30 గంట‌ల‌కు; అమెరికా కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం 8:00 గంట‌ల‌కు ఈ కార్య‌క్ర‌మం వ‌ర్చువ‌ల్‌గా జ‌రుగుతుంది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ‌విద్యాల‌యం కుల‌ప‌తి డా. తంగెడ కిష‌న్ రావు, ప్ర‌త్యేక అతిథిగా కెంటుకీలోని యూనివ‌ర్శిటీ ఆఫ్ లాయివిల్ అధ్య‌క్షురాలు డా. నీలి బెండ‌పూడి పాల్గొన‌నున్నారు. వీరితో పాటు మ‌రో 10 మంది విశిష్ట అతిథులు కూడా ఈ కార్య‌క్ర‌మానికి వ‌ర్చువ‌ల్‌గా హాజ‌రుకానున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన‌డానికి అందరూ ఆహ్వానితులేన‌ని తానా అధ్య‌క్షులు తాళ్లూరి జ‌య‌శేఖ‌ర్‌, తానా ప్ర‌పంచ‌ సాహిత్య వేదిక స‌మ‌న్వ‌యక‌ర్త‌ చిగురుమ‌ళ్ళ శ్రీనివాస్‌, తానా ప్ర‌పంచ‌ సాహిత్య వేదిక నిర్వాహ‌కులు డా. ప్ర‌సాద్ తోట‌కూర అన్నారు.


ఈ క్రింది ప్రసార మాధ్యమాల ద్వారా వీక్షించవచ్చు:

1. TANA TV Channel – in YuppTV

2. Facebook: https://www.facebook.com/tana.org

3. YouTube: https://www.youtube.com/channel/UCwLhSy1ptf0i1CioyeZmzrw

4. www.youtube.com/tvasiatelugu

5. www.youtube.com/manatv

మిగిలిన వివరాలకు: www.tana.orgలో చూడొచ్చు. 




Updated Date - 2021-06-22T20:31:09+05:30 IST