బంగారపు పొడి, వజ్రాల పౌడర్ మేళవించి తయారు చేసిన సుగంధాల సోప్... దీని ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!

ABN , First Publish Date - 2021-09-30T16:57:52+05:30 IST

టీవీ ఆన్‌చేస్తే చాలు వివిధ రకాల సబ్బులకు...

బంగారపు పొడి, వజ్రాల పౌడర్ మేళవించి తయారు చేసిన సుగంధాల సోప్... దీని ధర ఎంతో తెలిస్తే షాకవుతారు!

టీవీ ఆన్‌చేస్తే చాలు వివిధ రకాల సబ్బులకు సంబంధించిన ప్రకటనలే అత్యధికంగా కనిపిస్తాయి. అందరూ ఏదో ఒకరకమైన సోప్ వాడుతుంటారు. చర్మాన్ని శుభ్రపరిచే ఈ సబ్బుల ధరలు 15 రూపాయలు మొదలుకొని 50 రూపాయల వరకూ ఉంటాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు గురించి తెలిస్తే షాకవుతారు. ఈ సబ్బు ధర వందో, రెండొందలో కాదు ఏకంగా రెండు లక్షల రూపాయలు. ఈ సబ్బుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుంటే ఇంకా షాకవుతారు. 


మీడియాకు అందిన సమాచారం ప్రకారం లెబనాన్‌లోని ట్రిపోలీలో ఇటువంటి సబ్బులు తయారుచేస్తారు. వీటిని బదెర్ హసన్ అండ్ సన్స్ కుటుంబం తయారు చేస్తుంటుంది. ఈ సబ్సులను ది ఖాన్ అల్ సాబూన్ పేరుతో విక్రయిస్తుంటారు. ఈ కుటుంబానికి చెందిన వారు ఈ ఖరీదైన్ సోప్స్‌తో పాటు స్కిన్ కేర్ ఉత్పత్తులను కూడా తయారు చేస్తుంటారు. ఈ సబ్బు తయారీలో 17 గ్రాముల బంగారపు పౌడర్ వినియోగిస్తారు. అలాగే వజ్రాల పొడి, పరిశుభ్రమైన ఆలివ్ ఆయిల్, ఆర్గానిక్ హనీ, ఖర్జూరం మొదలైనవాటిని కూడా మేళవిస్తారు. బంగారపుపొడి, వజ్రాల పౌడర్ వాడినందునే ఈ సబ్బు ప్రపంచంలో కెల్లా అత్యంత ఖరీదైన సబ్బుగా పేరొందింది. ఈ సబ్బు ధర 2.800 డాలర్లు. మన కరెన్సీలో 2 లక్షలకు పైగా ఉంటుంది. ఈ సబ్బు ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడంతో పాటు, మానసిక ప్రశాంతత చేకూరుస్తుందని తయారీదారులు చెబుతారు.

Updated Date - 2021-09-30T16:57:52+05:30 IST