Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఏందిరయ్యో ఇదీ... ఎక్కడా వినలే... ఇంత పీనాసి కుటుంబమా... చెత్తలో చాక్లెట్లు ఏరుకుంటారా?... లంచ్‌కెళ్లారంటే ఏం చేస్తారోమరి...

ఈ ప్రపంచంలో విచిత్రమైన అభిరుచులు, అలవాట్లు కలిగిన మనుషులకేమీ కొదవలేదు. ఈ జాబితాలోకే వస్తారు ఈ తల్లిదండ్రులు. వారు డబ్బులు ఆదాచేసేందుకు విచిత్రమై పనులు చేస్తుంటారు. అంతటితో ఆగని వీరు తమ పిల్లలకు కూడా ఇటువంటి పనులు పురమాయిస్తారు. నలుగురు పిల్లలకు తల్లిదండ్రులైన రౌల్, పెట్రీసియా పింటో ప్రపంచంలోనే అత్యంత పీనాసి జంట అని చెప్పుకోవచ్చు. ఈ జంట వీరి పిల్లలను ఒక్కోసారి గ్యారేజ్‌కు తీసుకువెళతారు.

అక్కడ పిల్లల చేత వ్యాక్యూమ్ క్లీనర్ ఆపరేట్ చేయించి, చెత్త బ్యాగులో పడిన చిల్లర పైసలు, లేదా చాక్లెట్ల కోసం వెదికిస్తారు. ఆ తల్లిదండ్రులు గ్యారేజ్‌కు చేరుకున్నాక పెట్రీసియా తన ఇయర్ రింగు పోయిందని గ్యారేజ్ సిబ్బందికి చెబుతుంది. వెంటనే వారి పిల్లలు వ్యాక్యూమ్ క్లీనర్‌కు చెత్త బ్యాగును తగిలించి, దానిని ఆపరేట్ చేస్తారు. చెత్తను సేకరించాక ఒక రింగును గ్యారేజీ సిబ్బందికి చూపించి, ఆ చెత్తను తీసుకుని బయటకు వచ్చేస్తారు. ఈ సందర్బంగా పెట్రీసియా మాట్లాడుతూ ఈ  పని తమ పిల్లలకు ట్రెజర్ హంట్ లాంటిదని... వారు ఈ చెత్తలోని నాణేలు, చాక్లెట్లు, ఇయర్ ఫోన్లు ఏరుకుని మురిసిపోతుంటారని తెలిపారు. ఒక్కోసారి ఖరీదైన ఆభరణాలు కూడా దొరుకుతుంటాయన్నారు.  ఈ కుటుంబం లంచ్, డిన్నర్‌కు బయటకు వెళ్లినపుడు అక్కడ కూడా తమ పీనాసితనం చూపిస్తుంది.

దీని గురించి రౌల్ మాట్లాడుతూ నలుగురున్న మా కుటుంబానికి ప్రతీరోజూ ఎంతో ఆహారం అవసరమవుతుంది. ఇందుకయ్యే ఖర్చును తగ్గించేందుకు మేమంతా బయట భోజనం చేసేటప్పుడు ట్యాప్ వాటర్‌నే తాగుతాం. ఈ విధంగా వాటర్ బాటిల్ ఖర్చు తగ్గిస్తాం. రెస్టారెంట్‌లో భోజనం చేసేటప్పుడు అదనంగా సాల్ట్, సాస్ అడిగి ఇంటికి తెచ్చేసుకుంటాం. ప్రతీఒక్కరం విడివిడిగా శాండ్‌విచ్ ఆర్డర్ చేసే బదులు క్లబ్ శాండ్ విచ్ ఆర్డర్ చేస్తాం.  తరువాత వీలైనంత ఎక్కువ సలాడ్ అడుగుతామని చెప్పారు.

వారి పెద్దకుమార్తె మోనిక మాట్లాడుతూ తాము రెస్టారెంట్‌లో ఇలా చేసినప్పుడు వెయిటర్స్ తమను అసహ్యంగా చూస్తారని, తమను సైకోలుగా భావిస్తుంటారని తెలిపారు. కాగా పిల్లలు అత్యధికంగా బీరు తాగకూడదనే ఉద్దేశంతో రౌత్ ఇంటిలోని ఫ్రిజ్‌కు టైమర్ పెడతారు.  ఇంటిలోని ప్రతీ సభ్యుడు రోజుకు ఒకేసారి మాత్రమే  ఫ్రిజ్ డోర్ తీయాల్సివుంటుంది.  అదికూడా 24 సెకెన్లలో తిరిగి మూసివేయాలి. ఇంతేకాదు ఖరీదైన బీరు బాటిళ్లలో చౌక బీరు పోసి వాటిని నింపుతారు. అయితే... తమ పేరెంట్స్ చేసే పనులన్నీ తమకు తెలుసని, తమకు చౌక బీరు ఏదో ఇట్టే తెలిసిపోతుందని వారి పిల్లలు చెప్పారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement