రాజకీయాలకు కమల్‌ స్వస్తి?

ABN , First Publish Date - 2021-05-08T08:57:48+05:30 IST

తమిళనాడు రాజకీయాల్లో ‘మార్పు’ తెస్తానంటూ పార్టీపెట్టిన విశ్వనటుడు కమల్‌ హాసన్‌.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలతో నిరాశ చెందారా?..

రాజకీయాలకు కమల్‌ స్వస్తి?

అసెంబ్లీ ఎన్నికల ఫలితంతో తీవ్ర నిరాశ

ఆయన పార్టీని వీడుతున్న కీలక నేతలు


(చెన్నై-ఆంధ్రజ్యోతి)

తమిళనాడు రాజకీయాల్లో ‘మార్పు’ తెస్తానంటూ పార్టీపెట్టిన విశ్వనటుడు కమల్‌ హాసన్‌.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలతో నిరాశ చెందారా?.. ఆ కారణంగా ఆయన రాజకీయాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారా?.. అంటే ఔననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. ఈ మేరకు ఆయన త్వరలోనే నిర్ణయం వెలువరించనున్నారని తెలుస్తోంది. కమల్‌ సారథ్యంలోని ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోవడం, స్వయంగా ఆయన కూడా ఓడిపోవడంతో పార్టీ కార్యకర్తల్లో, అభిమానుల్లో నైరాశ్యం నెలకొంది.


దీనికితోడు పార్టీకి చెందిన పలువురు నేతలు పదవుల నుంచి వైదొలగుతున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు మహేంద్రన్‌ సైతం తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. అంతేకాకుండా కమల్‌ పార్టీ పట్ల ప్రజల్లో అంతగా ఆసక్తి లేకపోవడం, ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడం, తాను వ్యతిరేకించే భావజాల పార్టీలు అధికారానికి దూరం కావడం తదితర కారణాల నేపథ్యంలో కమల్‌ రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకోనున్నట్టు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Updated Date - 2021-05-08T08:57:48+05:30 IST