ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్ ఆచరణలో విఫలం

ABN , First Publish Date - 2020-12-01T09:41:42+05:30 IST

ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్ ఆలోచన మంచిదే అయినా..ఆచరణలో అది విఫలమైందని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నూతన చైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే అన్నారు.

ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్ ఆచరణలో విఫలం

ఐసీసీ కొత్త చైర్మన్‌

న్యూఢిల్లీ: ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్ ఆలోచన మంచిదే అయినా..ఆచరణలో అది విఫలమైందని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) నూతన చైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లే అన్నారు. ఫలితంగా దాని నుంచి ఆశించిన ప్రయోజనం నెరవేరలేదని చెప్పారు. కరోనా వైరస్‌ దరిమిలా చాంపియన్‌షిప్‌లోని లోపాలు బయటపడ్డాయని పేర్కొన్నారు. టెస్ట్‌లకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ‘చాంపియన్‌షిప్’నకు ఐసీసీ రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే. కానీ కొవిడ్‌ కారణంగా పలు సిరీస్‌లు రద్దు కావడంతో చాంపియన్‌షిఫ్ ఫైనల్‌ జట్లను నిర్ధారించేందుకు కొత్తగా పాయింట్ల శాతాన్ని ఐసీసీ ప్రకటించిన విషయం విదితమే. 

Updated Date - 2020-12-01T09:41:42+05:30 IST