నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం... థీమ్ ఏమిటంటే...

ABN , First Publish Date - 2020-09-27T16:16:39+05:30 IST

ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఈ సందర్బంగా టూరిజం ను ప్రోత్సహించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా టూరిస్టులు తమ ప్లాన్‌లకు దూరంగా ఉండాల్సివస్తోంది. అయితే...

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం... థీమ్ ఏమిటంటే...

న్యూఢిల్లీ: ఈరోజు ప్రపంచ పర్యాటక దినోత్సవం. ఈ సందర్బంగా టూరిజం ను ప్రోత్సహించే పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా టూరిస్టులు తమ ప్లాన్‌లకు దూరంగా ఉండాల్సివస్తోంది. అయితే ఈ కరోనా అంతం అయ్యాక ఎవరైనాసరే విహార యాత్రలకు వెళ్లవచ్చు. ప్రతీయేటా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని వేర్వేరు థీమ్‌లతో నిర్వహిస్తుంటారు. 2020 ప్రపంచ పర్యాటక దినోత్సవం థీమ్ ‘పర్యాటకం, గ్రామీణాభివృద్ధి’(టూరిజం అండ్ రూరల్ డెవలప్‌మెంట్).



పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా దీనిని నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్కృతులను కాపాడటంలో పర్యాటకరంగం చేయూతనందిస్తున్నది. పర్యాటకం ఆధారంగా ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. పలు దేశాలు వారివారి దేశంలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి నిధులను వెచ్చిస్తుంటాయి. 1980 నుంచి ఐక్యరాజ్య సమితి సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తోంది. 

Updated Date - 2020-09-27T16:16:39+05:30 IST