తిమోతీ రే బ్రౌన్ మృతి.. ఎయిడ్స్‌ను జయించారు కానీ..!

ABN , First Publish Date - 2020-10-01T01:47:59+05:30 IST

ఎయిడ్స్ వ్యాధి నుంచి కోలుకుని.. ఆ మహమ్మారిని జయించిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందిన తిమోతీ రే బ్రౌన్ ఇక లేరు. క్యాన్స

తిమోతీ రే బ్రౌన్ మృతి.. ఎయిడ్స్‌ను జయించారు కానీ..!

న్యూఢిల్లీ: ఎయిడ్స్ వ్యాధి నుంచి కోలుకుని.. ఆ మహమ్మారిని జయించిన మొదటి వ్యక్తిగా గుర్తింపు పొందిన తిమోతీ రే బ్రౌన్ ఇక లేరు. క్యాన్సర్ వ్యాధితో తిమోతీ రే బ్రౌన్ మరణించినట్లు ఆయన సన్నిహితులు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన తిమోతీ రే బ్రౌన్‌కు 1995లో హెచ్‌ఐవీ సోకింది. క్రమంగా ఎయిడ్స్ వ్యాధిగా మారింది. ఈ క్రమంలో ఆయన.. జర్మనీ రాజధానిలో ఎయిడ్స్ వ్యాధికి చికిత్స తీసుకున్నారు. వైద్య నిపుణులు ఆయనకు చికిత్స ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆయన 2006లో క్యాన్సర్ బారినపడ్డారు. వైద్య నిపుణుల పరిశోధనలు ఫలించడంతో.. తిమోతీ రే బ్రౌన్.. ఎయిడ్స్‌ను జయించారు. ఈ క్రమంలోనే ఆయన క్యాన్సర్‌ వ్యాధి నుంచి కూడా కోలుకున్నారు. అయితే గత సంవత్సరం క్యాన్సర్ వ్యాధి మళ్లీ తిరగబెట్టింది. వెన్నెముక, మెదడుకు చేరింది. దీంతో తిమోతీ రే బ్రౌనీ మరణించారని.. ఆయన సన్నిహితులు వివరించారు. 

Updated Date - 2020-10-01T01:47:59+05:30 IST