విజయవంతమైన అతిపెద్ద ఎలక్ట్రిక్ విమాన ప్రయోగం

ABN , First Publish Date - 2020-05-29T21:51:03+05:30 IST

ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం విజవయంతంగా...

విజయవంతమైన అతిపెద్ద ఎలక్ట్రిక్ విమాన ప్రయోగం

వాషింగ్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ విమానం విజవయంతంగా ఎగిరింది. సెస్నా 208 క్యారవాన్ విమానం అయిన దీనిలో 750 హార్స్‌పవర్ ఉన్న మోటార్‌ను బిగించి ఈ-క్యారవాన్‌గా మార్చారు. ఈ మోటారును అమెరికాలోని మాగ్నిఎక్స్ అనే స్టార్టప్ కంపెనీ తయారుచేసింది. ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్ సంస్థ ఎయిరోటెక్ దీనికి తుదిమెరుగులద్దింది. ఇది దాదాపు 2,500 అడుగుల ఎత్తువరకు ఎగిరిందని, అరగంట సేపు ఆకాశంలో విహరించిందని మాగ్నిఎక్స్ పేర్కొంది.

Updated Date - 2020-05-29T21:51:03+05:30 IST