‘వరల్డ్‌ విజన్‌’ సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2020-08-05T10:53:27+05:30 IST

జిల్లా లో పేద, నిరాశ్రయులకు అండగా ఉంటున్న వరల్డ్‌ విజన్‌ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమ ని ఎస్పీ రాజకుమారి కొనియాడారు.

‘వరల్డ్‌ విజన్‌’ సేవలు అభినందనీయం

దాసన్నపేట : జిల్లా లో పేద, నిరాశ్రయులకు అండగా ఉంటున్న వరల్డ్‌ విజన్‌ స్వచ్ఛంద సంస్థ సేవలు అభినందనీయమ ని ఎస్పీ రాజకుమారి కొనియాడారు. మంగళవా రం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆ సంస్థ మేనేజర్‌ శ్యామ్‌బాబు పోలీసు సిబ్బందికి అవసరమైన ఫేస్‌ షీల్డ్స్‌, గ్లౌజులు ఎస్పీకి అందించారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ సభ్యుడు కేసలి అప్పారావు మాట్లాడుతూ  కరోనా నియంత్రణకు వరల్డ్‌విజన్‌ చేస్తున్న కృషి హర్షనీయమన్నారు. ఈ సందర్భంగా బాలల రక్షణ కోసం రూపొందించిన పుస్తకాలను ఎస్పీ ఆవిష్కరించారు. డీఎస్పీలు వీరాంజనేయరెడ్డి, ఎల్‌.శేషాద్రి, విజయనగరం రూరల్‌ సీఐ టీఎస్‌ మంగవేణి, ట్రాఫిక్‌ సీఐ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-08-05T10:53:27+05:30 IST