కరోనాతో అల్లాడిపోతున్న ప్రపంచదేశాలు

ABN , First Publish Date - 2020-04-02T22:27:02+05:30 IST

కరోనా వైరస్ సోకినవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది.

కరోనాతో అల్లాడిపోతున్న ప్రపంచదేశాలు

కరోనా వైరస్ సోకినవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. క్రమంగా మరణాలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 9,35,957 మంది కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో 1,94,286 మంది మాత్రమే కోలుకున్నారు. 47,245 మంది చనిపోవడం నిజంగా విషాదమే అవుతుంది.


కరోనా వైరస్‌తో అగ్రరాజ్యం అమెరికా అల్లాడిపోతోంది. అక్కడ 2,15,215 కేసులు నమోదయ్యాయి. అందులో 8,878 మంది కోలుకున్నారు. మొత్తం 5,110 మంది మరణించారు. మరణాల సంఖ్య మరింత పెరగవచ్చన్న అనుమానాలు బలపడుతున్నాయి. చైనాను దాటిపోయిన మొదటి దేశం ఇటలీ. అక్కడ ఇంతవరకు 1,10,574 కేసులు నమోదయ్యాయి. 16,847 మంది కోలుకున్నారు. 13,155 మంది మరణించారు. స్పెయిన్‌లో మొత్తం కేసులు 1,10,118 కాగా, 22,647 మంది కోలుకున్నారు. 9,387 మంది మరణించారు.


తొట్టతొలి కరోనా కేసు నమోదైన దేశం చైనా. ఇక్కడ ఇంత వరకు 81,554 కేసులు నమోదయ్యాయి. 76,238 మంది కోలుకోగా.. 3,312 మంది మృతి చెందారు. జర్మనీ ఇక్కడ మొత్తం కేసులు 77,981, కోలుకున్నవారు 18,700. మరణాలు 981. యూరప్‌లో ఇటలీ, స్పెయిన్ తర్వాత అత్యధిక బాధిత దేశం యూకే. అక్కడ మొత్తం 29,474 కేసులు నమోదయ్యాయి. అందులో 135 మంది కోలుకోగా 2,352 మంది మరణించారు.


స్వట్జర్లాండ్:

మొత్తం కేసులు.. 17,768, కోలుకున్నవారు.. 2,967, మరణాలు.. 488.

టర్కీ:

మొత్తం కేసులు.. 15,679, కోలుకున్నవారు.. 333, మరణాలు.. 277.

బెల్జియం:

మొత్తం కేసులు.. 13,964, కోలుకున్నవారు.. 2,132, మరణాలు.. 828.

దక్షిణ కొరియా:

మొత్తం కేసులు.. 9,976, కోలుకున్నవారు.. 5,828, మరణాలు.. 169.

ఆస్ట్రేలియా:

మొత్తం కేసులు.. 5,105, కోలుకున్నవారు.. 345, మరణాలు.. 23.


ఇండియాలో..

మొత్తం కేసులు.. 1,965, కోలుకున్నవారు.. 143, మరణాలు.. 58.

ఆంధ్రప్రదేశ్: మొత్తం కేసులు.. 132, కోలుకున్నవారు.. 1, మరణాలు.. 0.

తెలంగాణ: మొత్తం కేసులు.. 127, కోలుకున్నవారు.. 14, మరణాలు.. 9.

కర్ణాటక: మొత్తం కేసులు.. 109, కోలుకున్నవారు.. 9, మరణాలు.. 3.

కేరళ: మొత్తం కేసులు.. 264, కోలుకున్నవారు.. 24, మరణాలు.. 2.

తమిళనాడు: మొత్తం కేసులు.. 240, కోలుకున్నవారు.. 6, మరణాలు.. 1.

మహారాష్ట్ర: మొత్తం కేసులు.. 341, కోలుకున్నవారు.. 39, మరణాలు.. 12.

ఢిల్లీ: మొత్తం కేసులు.. 158, కోలుకున్నవారు.. 6, మరణాలు..2.

గుజరాత్: మొత్తం కేసులు.. 87, కోలుకున్నవారు.. 5, మరణాలు.. 7.

రాజస్థాన్ : మొత్తం కేసులు.. 129, కోలుకున్నవారు.. 3, మరణాలు.. 0.

మధ్యప్రదేశ్: మొత్తం కేసులు.. 86, కోలుకున్నవారు..0, మరణాలు.. 4.

పశ్చిమబెంగాల్: మొత్తం కేసులు.. 43, కోలుకున్నవారు.. 0, మరణాలు.. 6.

ఉత్తరప్రదేశ్: మొత్తం కేసులు.. 117, కోలుకున్నవారు.. 17, మరణాలు.. 2.

పంజాబ్: మొత్తం కేసులు.. 43, కోలుకున్నవారు.. 1, మరణాలు.. 4.

హర్యానా: మొత్తం కేసులు.. 64, కోలుకున్నవారు.. 17, మరణాలు.. 1.

బిహార్: మొత్తం కేసులు.. 23, కోలుకున్నవారు.. 0, మరణాలు.. 1.

జమ్మూకశ్మీర్: మొత్తం కేసులు..64, కోలుకున్నవారు.. 2, మరణాలు.. 2.

Updated Date - 2020-04-02T22:27:02+05:30 IST