అధ్వానంగా రహదారులు

ABN , First Publish Date - 2021-06-21T05:44:56+05:30 IST

నందికొట్కూరు నుంచి వడ్డెమాను, శాతనకోట, అల్లూరు, మల్యాల గ్రామాలకు వెళ్లే రోడ్లు గుంతలమయమయ్యాయి.

అధ్వానంగా రహదారులు
వడ్డెమాన్‌ రహదారి దుస్థితి

  1. పట్టించుకోని అధికారులు


 నందికొట్కూరు రూరల్‌, జూన్‌ 20: నందికొట్కూరు నుంచి  వడ్డెమాను, శాతనకోట, అల్లూరు, మల్యాల గ్రామాలకు వెళ్లే రోడ్లు గుంతలమయమయ్యాయి. ఈ రోడ్లను క్రిష్ణా పుష్కరాల సమయంలో వేశారు. ఆ తర్వాత  తుంగభద్రా పుష్కరాలు కూడా వచ్చి పోయాయి. 14 సంవత్సరాలు కావస్తున్నా ఈ రోడ్లను పట్టించుకొనేవారే లేరు. దీంతో వాహనదారు ్డలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లకు అక్కడ అక్కడ మరమ్మతులు చేశారు.  అవి మళ్లీ  దెబ్బతింటున్నాయి.  అయినా ఆర్‌ అండ్‌ బీ అధికారులు పట్టించుకోలేదు.   అల్లూరు, మల్యాల, వడ్డెమాను, శాతనకోట గ్రామాల నుంచి నందికొట్కూరు పట్టణానికి వెళ్లాలంటే దాదాపుగా 6 కిలోమీటర్లు ప్రయా ణం చేయాల్సి వస్తోంది.  


  అధికారులకు విన్నవించినా ఫలితం లేదు..

 రోడ్లు బాగు చేయాలని ఎన్నిమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేదు. దాదాపుగా 14 సంవత్సరాలుగా రోడ్లను వేయలేదన్నారు.  

-  పక్కీర్‌సాహెబ్‌, సీపీఎం నాయకుడు


 

Updated Date - 2021-06-21T05:44:56+05:30 IST