అధ్వానంగా సిర్పూర్‌(టి)- కాగజ్‌నగర్‌ రోడ్డు

ABN , First Publish Date - 2021-06-14T04:14:58+05:30 IST

మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు సిర్పూర్‌(టి)- కాగజ్‌నగర్‌, అంతర్రాష్ట్ర అధ్వానంగా మారింది.

అధ్వానంగా సిర్పూర్‌(టి)- కాగజ్‌నగర్‌ రోడ్డు
సిర్పూర్‌(టి)-కాగజ్‌నగర్‌ రోడ్డుపై ఏర్పడ్డ గుంతలు

సిర్పూర్‌(టి), జూన్‌ 13: మూడు, నాలుగు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు సిర్పూర్‌(టి)- కాగజ్‌నగర్‌, అంతర్రాష్ట్ర అధ్వానంగా మారింది. రోడ్డుపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదారిగుండా ప్రతి నిత్యం వందల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. ఈరోడ్లపై భారీవాహనాలు కూడా వెళ్తుండడంతో రోడ్లు తొందరగా దెబ్బతింటున్నా యని వాహనదారులు పేర్కొంటున్నారు. పాద చారులు నడవడానికి మరీ ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరుతున్నారు.

Updated Date - 2021-06-14T04:14:58+05:30 IST