Abn logo
Apr 20 2021 @ 23:27PM

సీఎం కేసీఆర్‌ కోలుకోవాలని పూజలు

ఇచ్చోడరూరల్‌, ఏప్రిల్‌ 20: కరోనా పాజిటివ్‌ వచ్చిన సీఎం కేసీఆర్‌ త్వరలో కోలుకోవాలని మండలంలోని ముఖ్ర(కె) గ్రామస్థులు పూజలు చేశారు. మంగళవారం గ్రామంలోని హనుమాన్‌ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి కేసీఆర్‌ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్ర(కె) సర్పంచ్‌ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ సభ్యుడు సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement
Advertisement