అధ్వానంగా సీటీఎం క్రాస్‌ - అంగళ్లు రోడ్డు

ABN , First Publish Date - 2021-09-02T05:37:12+05:30 IST

మదనపల్లె మండలంలోని సీటీఎం క్రాస్‌ రోడ్డు నుంచి కురబలకోట మండలం అంగళ్లుకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. ప్రభుత్వం స్పందించి తారురోడ్డు వేయాలని వాహనచోదకులు, చుట్టుపక్కల గ్రామస్తులు కోరుతున్నారు. మదనపల్లె మండలంలోని సీటీఎం క్రాస్‌ రోడ్డు నుంచి కురబలకోట మండలం అంగళ్లుకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. ప్రభుత్వం స్పందించి తారురోడ్డు వేయాలని వాహనచోదకులు, చుట్టుపక్కల గ్రామస్తులు కోరుతున్నారు.

అధ్వానంగా సీటీఎం క్రాస్‌ - అంగళ్లు రోడ్డు
అధ్వానంగా మారిన సీటీఎం క్రాస్‌రోడ్‌, అంగళ్లు రోడ్డు

మదనపల్లె రూరల్‌, సెప్టెంబరు 1: మదనపల్లె మండలంలోని సీటీఎం క్రాస్‌ రోడ్డు నుంచి కురబలకోట మండలం అంగళ్లుకు వెళ్లే రోడ్డు అధ్వానంగా మారింది. సీటీఎం రైల్వేస్టేషన్‌ నుంచి అంగళ్లుకు వెళ్లే దారిలో 20 పల్లెలకుగా పైగా ఉన్నాయి.  సీటీఎం నుంచి అంగళ్లుకు మదనపల్లె మీదుగా వెళ్లాలంటే  20 కిలోమీటర్లు పైగా ఉంటుంది. అదే సీటీఎం-అంగళ్లు మీదుగా అయితే 8 కిలోమీటర్లు ఉంటుంది. ద్విచక్రవాహనదారులు, కార్లలో వెళ్లే వారు తిరుపతి, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం నుంచి కదిరి రోడ్డులో ఏఊరు వెళ్లాలన్నా మదనపల్లెకు రాకుండా ఎక్కువగా సీటీఎం అంగళ్లు రోడ్డులోనే ప్రయాణిస్తారు. అలాగే చుట్టుపక్కల గ్రామాల ప్రజలు  నిత్యావసర సరుకులు, కూరగాయలు ఇతర పనులపై ప్రతిరోజు ద్విచక్రవాహనాలు, ఆటోల్లో  సీటీఎం క్రాస్‌ రోడ్డుకు రావాల్సిందే. అలాగే దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా సీటీయం క్రాస్‌ రోడ్డులో ఉన్న రైల్వేస్టేషన్‌కు వస్తుంటారు. నిత్యం ఆటోలు, ద్విచక్రవాహనాలు తిరిగే ఈరోడ్డు గుంతలు పడి, కంకర తేలిపోవడంతో పటు చోట్ల కోతలకు గురైంది. ఇటీవల కురుస్తున్న వర్షాలకు కొన్నిచోట్ల బురదమయంగా మారింది.  దీంతో ఈ రోడ్డులో భయం భయంగా వాహనదారులు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తారురోడ్డు వేయాలని వాహనచోదకులు, చుట్టుపక్కల గ్రామస్తులు కోరుతున్నారు. 




Updated Date - 2021-09-02T05:37:12+05:30 IST