రాష్ట్రంలో అధ్వాన పాలన

ABN , First Publish Date - 2022-06-19T06:01:57+05:30 IST

జగన్మోహన్‌రెడ్డి పాలన అధ్వా నంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్‌ రాజగోపాల్‌ (తాతయ్య) ఆరోపిం చారు.

రాష్ట్రంలో అధ్వాన పాలన
వెంకటాపురంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య

బాదుడే - బాదుడులో టీడీపీ నేతలు

పెనుగంచిప్రోలు, జూన్‌ 18:  జగన్మోహన్‌రెడ్డి పాలన అధ్వా నంగా ఉందని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్‌ రాజగోపాల్‌ (తాతయ్య) ఆరోపిం చారు. వెంకటాపురం, పొన్నవరం గ్రామాల్లో బాదుడే- బాదుడులో పాల్గొన్నారు. తాతయ్య మాట్లాడుతూ సీఎం జగన్‌ కాసులకు కక్కుర్తిపడి జే బ్రాండ్‌ పేరుతో నాసిరకం మద్యాన్ని ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు పట్టం కట్టా లని కోరారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు చింతల వెంకట సీతారామయ్య, జిల్లేపల్లి సుధీర్‌బాబు, మాధినేని వెంకట్రావ్‌, కమతం బ్రహ్మానందం, మట్టగుంజ కోటేశ్వరరావు, పగడం ఏసు పాల్గొన్నారు. 


పేదవారు గుడిసెల్లోనే జీవించాలా?: దేవదత్‌  

తిరువూరు :  టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం ఆటకెక్కించిందని, అబ్ధిదారులకు అందజేయకుండా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని టీడీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి శావల దేవదత్‌ అన్నారు. నమస్తే తిరువూరులో భాగంగా శనివారం 13వ వార్డులో పర్యటించిన ఆయన దృష్టికి పలువురు సమస్యలను తీసుకువచ్చారు. ఈ సందర్భంగా దేవదత్‌ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం పట్టణంలో సుమారు 1500 మందికి టిడ్కో ఇళ్లను నిర్మించింది. వాటిని లబ్ధిదారులకు అందజేసే సమయానికి ఎన్నికలు రావటంతో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన జగన్‌రెడ్డి టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేయకుండా కక్షపూరితంగా వ్యవహ రిస్తు న్నారన్నారు. ప్రజలపై పన్నుల భారం  మినహాసంక్షేమం, అభివృదిఽ్ధ అంశాలు విస్మరించారని విమర్శించారు. వార్డులో బాదుడే బాదుడు కరపత్రాలు ఇంటింటికి పంపిణీ చేశారు.  కార్యక్రమంలో నాయకులు బొమ్మసాని మహేష్‌, సిందు శ్రీను, యండ్రాతి చంద్రశేఖరరావు(చంద్రం)మీనుగు శ్రీనివాసరావు, కొత్తపల్లి ఆనంద్‌స్వరూప్‌, మార్కెండేశ్వరరావు, మల్లిపెద్ది సతీష్‌చంద్ర(టింకు), పర్వతం శ్రీనివాసరావు, ఇజ్జాగాని రాము, పంది శ్రీనివాసరావు, తోట వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.


Updated Date - 2022-06-19T06:01:57+05:30 IST