దారుణం..ఉమ్మడి జిల్లాలో అధ్వానంగా ఆర్‌అండ్‌బీ రోడ్లు

ABN , First Publish Date - 2020-09-30T06:46:33+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్లు అధ్వానంగా మారాయి. కంకరతేలి గుంతలు పడిన రోడ్లు ప్రయాణికులకు చుక్కలు

దారుణం..ఉమ్మడి జిల్లాలో అధ్వానంగా ఆర్‌అండ్‌బీ రోడ్లు

గుంతల రోడ్లపై ప్రాణ సంకటంగా మారిన ప్రయాణం 

పట్టించుకోని పాలకులు, అధికారులు


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆర్‌అండ్‌బీ రోడ్లు అధ్వానంగా మారాయి. కంకరతేలి గుంతలు పడిన రోడ్లు ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. అస్తవ్యస్తంగా మారిన రోడ్లతో వాహనదారులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణం సాగిస్తున్నారు. రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. భారీ వర్షాలతో ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో 133.79 కిలోమీటర్ల మేర(ఆర్‌అండ్‌బీ) రోడ్లు దెబ్బతిన్నాయి. ఇందులో అత్యధికంగా వికారాబాద్‌ జిల్లాలో 61.79 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి. అలాగే రంగారెడ్డి జిల్లాలో 48 కిలో మీటర్లు, మేడ్చల్‌ జిల్లాలో 24 కిలోమీటర్ల మేర రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షాల కంటే ముందు గడిచిన ఏడాది లేదా రెండేళ్ల వ్యవధిలో రహదారుల నిర్వహణకు జిల్లా అధికారులు రూ.5.95 కోట్లు నిధుల కోసం ప్రతిపాదనలు పం పారు. ఇందులో రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ నియోజకవర్గంలో రూ.5 కోట్లు, చేవెళ్ల నియోజకవర్గంలో 95 లక్షలు ప్రతిపాదనలు పంపారు.  కానీ.. ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు. వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలో అసలు ప్రతిపాదనల ముచ్చటే లేదు. కానీ.. ఇటీవలి వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులకు తాత్కాలిక, శాశ్వత మరమ్మతుల కోసం రూ.1687లక్షల నిధుల కోసం ప్రతిపాదించారు. ఇందులో అత్యధికంగా వికారాబాద్‌ జిల్లాలో రూ.1662 లక్షలు ఉండగా, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి రూ.15లక్షలు, మేడ్చల్‌ నియోజకవర్గంలో రూ.10 లక్షలు ఉన్నాయి.  


నాణ్యతా లోపం...రోడ్డంతా గుంతలమయం

షాద్‌నగర్‌ నుంచి కేశంపేట మండల కేంద్రం మీదుగా ఆమనగల్లు వెళ్లే రహదారి పూర్తిగా గుంతలమయంగా మారింది. ఐదేళ్లక్రితం రూ.23కోట్లతో రోడ్డును విస్తరించి బీటీ వేశారు. కాగా కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో ఈ రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. ఇటీవల కురిసిన వర్షాలకు పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ రోడ్డు గుండా ప్రతినిత్యం వందలాది వాహనాలు వెళ్తుంటాయి. రోడ్డు దుస్థితి కారణంగా వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్నిసందర్భాల్లో ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని వాహనచోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


ఉమ్మడి జిల్లాలోని దెబ్బతిన్న రోడ్ల వివరాలు

రంగారెడ్డి వికారాబాద్‌ మేడ్చల్‌ మొత్తం

వర్షానికి దెబ్బతిన్న రోడ్లు(కిలోమీటర్లు) 48 61.79 24 133.79


రెండేళ్ల వ్యవధిలో రహదారుల..నిర్వహణకు జిల్లా అధికారులు

ఎన్ని నిధుల కోసం రూ.5.95 కోట్లు ప్రతిపాదనలు ప్రతిపాదనలు రూ.5.95 కోట్లు

 ప్రతిపాదనలు పంపారు? పంపలే పంపలే


ఎన్ని నిధులు ప్రభుత్వం ఇచ్చింది?

రూపాయి నిధులు ఇవ్వలే నిధులు ఇవ్వలే నిధులు ఇవ్వలే.కూడా ఇవ్వలే

ఇటీవలి వర్షాల కారణంగా దెబ్బతిన్న రూ.15 లక్షలు రూ.1662 లక్షలు రూ.10లక్షలు రూ.1687లక్షలు

రహదారులకు తాత్కాలిక,శాశ్వత మరమ్మతులకు ఎన్నినిధులు ప్రతిపాదించారు? 

Updated Date - 2020-09-30T06:46:33+05:30 IST