రవి దహియా చేతిపై ఆ గాయం.. మండిపడ్డ సెహ్వాగ్

ABN , First Publish Date - 2021-08-06T11:00:52+05:30 IST

భారత రెజ్లర్ రవిదహియా దేశానికి కాంస్య పతకం అందించి చరిత్ర సృష్టించాడు. భారత్ తరపున 6వ రెజ్లర్‌గా రజత పతకం ..

రవి దహియా చేతిపై ఆ గాయం.. మండిపడ్డ సెహ్వాగ్

భారత రెజ్లర్ రవిదహియా దేశానికి కాంస్య పతకం అందించి చరిత్ర సృష్టించాడు. భారత్ తరపున 6వ రెజ్లర్‌గా రజత పతకం గెలిచి రెండో స్థానంలో నిలిచాడు. ఫైనల్లో రష్యా రెజ్లర్‌, రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్ జవుర్‌ ఉగేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడడంతో రజతపతకంతో సరిపెట్టుకున్నాడు. అయితే అంతకుముందు బుధవారం కజకిస్తాన్‌కు చెందిన రెజ్లర్‌  నూరిస్లామ్‌ సనయేవ్‌తో దహియా తలపడ్డాడు. ఈ క్రమంలోనే ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ చివరి దశలో ఓడిపోతున్నాననే బాధలో సనయేవ్‌ ఏఖంగా దహియా చేతిని కొరకేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మ్యాచ్ అనంతరం దహియా చేతిపై కొరికిన గాయాన్ని స్పష్టంగా గమనించవచ్చు.


ఇక ఇదే విషయంపై టీమిండియా మాజీ డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. '' ఇదేం పద్దతి.. ఎంత ఓడిపోతున్నాననే బాధలో ఉంటే ప్రత్యర్థి చేయి కొరకడం సమంజసం కాదు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్ధం. ఒక ఆటగాడిని గౌరవించే పద్దతి ఇదేనా అంటూ కామెంట్‌ చేశాడు.

Updated Date - 2021-08-06T11:00:52+05:30 IST