ఉత్తరం రాస్తే పెళ్లి ఖాయం!

ABN , First Publish Date - 2021-04-20T05:30:00+05:30 IST

పెళ్లి కావాల్సిన యువతీయువకులు దేవుళ్లకు రకరకాల మొక్కులు మొక్కడం చూస్తూనే ఉంటాం! కానీ జర్మనీలో మాత్రం ఓక్‌ చెట్టుకు ఉత్తరం రాస్తే చాలు. కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆ విశేషాలు ఇవి...

ఉత్తరం రాస్తే పెళ్లి ఖాయం!

పెళ్లి కావాల్సిన యువతీయువకులు దేవుళ్లకు రకరకాల మొక్కులు మొక్కడం చూస్తూనే ఉంటాం! కానీ జర్మనీలో మాత్రం ఓక్‌ చెట్టుకు ఉత్తరం రాస్తే చాలు. కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఆ విశేషాలు ఇవి...


  1. జర్మనీలోని యుటిన్‌ పట్టణానికి సమీపంలో ఉందీ ఓక్‌ చెట్టు. స్థానికులు, ఈ చెట్టు గురించి తెలిసిన చుట్టు పక్కల గ్రామాల ప్రజలు మంచి భాగస్వామి లభించేలా చూడు అంటూ ఈ చెట్టుకు ఉత్తరాలు రాస్తుంటారు. దాదాపుగా ఉత్తరాలు రాసిన వారందరూ తమ కోరికలు నెరవేరాయని చెబుతారు. అందుకే ఈ చెట్టును ‘బ్రైడ్‌గ్రూమ్‌ ఓక్‌’ అని పిలుస్తుంటారు.
  2. ఈ చెట్టుకు ఉత్తరాలు రాయడం వెనకాల ఒక కథ ఉంది. 1890లో స్థానికంగా నివసించే ‘మిన్నా’ అనే యువతి, ‘విల్‌హెల్మ్‌’ అనే యువకుడు ప్రేమించుకున్నారు. వీళ్లిద్దరూ రహస్యంగా ఉత్తరాలు రాసుకునే వారు. అలా ఏడాది పాటు వీరి ప్రేమాయణం సాగింది. ఏడాది ప్రేమకు ఆ ఓక్‌ చెట్టు సాక్ష్యంగా నిలిచింది. వీళ్ల ఉత్తరాలకు అడ్డా ఆ ఓక్‌ చెట్టే. అలా సాగిన వాళ్ల ప్రేమాయణం పెళ్లికి దారి తీసింది. మిన్నా వాళ్ల నాన్న పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో అదే ఓక్‌ చెట్టు కింద వాళ్లు పెళ్లి చేసుకున్నారు.
  3. ఈ విషయం ఆ నోటా ఈ నోటా బాగా వ్యాపించింది. ఓక్‌ చెట్టు మహిమ వల్లే పెళ్లి జరిగిందని ప్రచారం జరిగింది. తరువాత పలువురు తమకు భాగస్వామి లభించేలా చూడమని కోరుతూ ఉత్తరం రాసి ఆ చెట్టు రంధ్రంలో వేయడం ప్రారంభించారు. కొన్నాళ్లకు జర్మన్‌ పోస్టల్‌ డిపార్డుమెంటు వారు ఆ చెట్టుకు ప్రత్యేకమైన పోస్టు కోడ్‌ కేటాయుంచారు.



Updated Date - 2021-04-20T05:30:00+05:30 IST