ఆగస్ట్ 7న ఎస్‌ఐ పోస్టులకు రాత పరీక్ష

ABN , First Publish Date - 2022-07-04T21:15:26+05:30 IST

ఆగస్ట్ 7న ఎస్‌ఐ (Sub Inspector) పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ (Hyderabad)తో పాటు 20 ప్రాంతాల్లో ఎగ్జామ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు.

ఆగస్ట్ 7న ఎస్‌ఐ పోస్టులకు రాత పరీక్ష

హైదరాబాద్: ఆగస్ట్ 7న ఎస్‌ఐ (Sub Inspector) పోస్టులకు రాత పరీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్‌ (Hyderabad)తో పాటు 20 ప్రాంతాల్లో ఎగ్జామ్‌ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఎస్ఐ రాత పరీక్షకు 2.45 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 30 నుంచి ఎస్‌ఐ అభ్యర్థుల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. అదేవిధంగా ఆగస్ట్ 21న కానిస్టేబుల్ రాత పరీక్ష నిర్వహిస్తారు. హైదరాబాద్‌తో పాటు 40 ప్రాంతాల్లో ఎగ్జామ్‌ సెంటర్లు ఏర్పాట్లు చేశారు. ఆగస్ట్‌ 10 నుంచి కానిస్టేబుల్ అభ్యర్థుల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కానిస్టేబుల్ రాత పరీక్షకు 6.50 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.


దాదాపు నాలుగేళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం పోలీసు కొలువుల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేయడంతో నిరుద్యోగుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. పోలీసు శాఖలో 17,516 పోస్టుల భర్తీ కోసం సర్కారు ప్రకటన ఇవ్వగా.. అనూహ్యంగా అభ్యర్థుల నుంచి రికార్డు స్థాయిలో 12,91,058 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో మహిళల నుంచి 2,76,311 దరఖాస్తులు(21 శాతం) వచ్చాయి. ఒక్కో సివిల్‌ ఎస్సై పోస్టుకు సగటున 447 మంది, కమ్యూనికేషన్స్‌ ఎస్సై పోస్టుకు 660, కానిస్టేబుల్‌ పోస్టుకు 59 మంది పోటీపడుతున్నారు. 2018లో 18,428 పోస్టులకు 7,19,840 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఈసారి 17,516 పోస్టులకు రికార్డు స్థాయిలో 12,91,058 దరఖాస్తులు వచ్చాయి. గతంతో పోలిస్తే 80 శాతం మేర దరఖాస్తులు పెరిగాయి. మొత్తంగా 11 రకాల పోస్టులకు నోటిఫికేషన్లు వెలువడగా... అందులో ఒక పోస్టుకు 52 శాతం మంది, 2 పోస్టులకు 29 శాతం, 3 పోస్టులకు 15 శాతం, 4 పోస్టులకు 3 శాతం మంది దరఖాస్తులు చేసుకున్నారు.


Updated Date - 2022-07-04T21:15:26+05:30 IST