తప్పని తిప్పలు

ABN , First Publish Date - 2022-08-12T06:01:52+05:30 IST

ప్రభుత్వం కస్తూర్బా విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు నాణ్యమైన వసతులు కల్పించేందుకు కోట్ల రూపా యాలు వెచ్చిస్తున్నది.

తప్పని తిప్పలు
తాగేందుకు డ్రమ్ములో నింపిన కలుషిత నీరు

- కస్తూర్బా పాఠశాలలో విద్యార్థుల అవస్థలు

- పట్టించుకోని అధికారులు 

- మూలన పడిన కోట్ల రూపాయల విలువైన యంత్రాలు 

- చన్నీటితోనే స్నానం చేస్తున్న విద్యార్థులు

- తాగేందుకు బోరునీళ్లే గతి

మహబూబ్‌నగర్‌ విద్యావిభాగం ఆగస్టు 11 : ప్రభుత్వం కస్తూర్బా విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు నాణ్యమైన వసతులు కల్పించేందుకు కోట్ల రూపా యాలు వెచ్చిస్తున్నది. విద్యుత్‌ సమస్యను అధిగమిం చేందుకు సోలార్‌ విద్యుత్‌ను ఏర్పాటు చేసింది.  విద్యా ర్థులు వేడినీటితో స్నానం చేసేందుకు జిల్లాలోని కేజీబీవీ లలో సోలార్‌ పలకలు ఏర్పాటు చేశారు. కానీ ఆ యం త్రాలు మొదట్లో బాగానే పనిచేసినా.. నిర్వహణ లోపంతో కోట్లరూపాయల విలువ చేసే యాంత్రాలు చాల చోట్ల మూలన పడ్డాయి. మరికోన్ని చోట్ల తూతూ మంత్రంగా పని చేస్తున్నాయి. దీంతో విద్యార్థులకు చన్నీటి స్నానం తప్పడం లేదు. ఆర్‌వో ప్లాంట్స్‌ సరిగా పనిచేయకపోవ డంతో తాగేందుకు బోరునీరు ఇస్తున్నారు. కొన్ని కేజీబీవీ లలో బయటి నుంచి ఫిల్టర్‌  వాటర్‌ ఇస్తున్నట్లు సమా చారం. కస్తూర్బాలో ఉన్న సమస్యలు బయటకు చెబితే మీ టీసీలు ఇచ్చి ఇంటికి పంపిస్తామని విద్యార్థులను ఎస్‌వోలు, సీఆర్టీలు భయపెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

  అధికారిక లెక్కలు ఇలా... 

ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో మొత్తం 75 కస్తూర్బా విద్యాలయాలు ఉన్నాయి. అప్పట్లో  ఒక్కో విద్యాలయానికి సుమారు రూ.7.5 లక్షలు ఖర్చు చేసి ఆర్‌వోప్లాంట్‌, నీటిని వేడి చేసేందుకు సౌలార్‌ పలకలు ఏర్పాటు చేశారు. కోట్ల రూపాయలు కర్చు చేసినా విద్యా ర్థులకు ఉపయోగం లేకుండా పోవడంతో తీవ్ర విమ ర్శలు వస్తున్నాయి. పాలమూరు జిల్లాలో 14 కస్తూర్బా విద్యాలయాలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో 200 మంది విద్యార్థులు ఉండేందుకు ప్రభుత్వం సౌకర్యాలు కల్పి స్తున్నది. అదే విద్యాలయాల్లో ఏడు చోట్ల ఇంటర్‌ విద్య ను కూడా ప్రారంభించారు. ఇంటర్మీడియట్‌కు సంబం ధించి రెండు కోర్సులు ప్రవేశ పెట్టడంతో ప్రతీ విద్యాల యంలో 160 మంది విద్యార్థులు పెరిగా రు. దీంతో ఒక్కో విద్యాల యంలో విద్యార్థుల సంఖ్య 360కి చేరింది. దీంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. విద్యార్థుల సంఖ్య పెరగడంతో మూత్రశాలలు, బాత్‌రూమ్‌లు సరి పోడంలేదు. అంతే కాకుండా అపరిశుభ్ర వాతావరణం నెలకొన్నది. దీంతో చాలామంది విద్యార్థులు అనారోగ్యానికి గురి అవుతున్నా రు. జిల్లా కేంద్రంలోని అర్బన్‌ కస్తూర్బా విద్యాలయంలో సోలార్‌ వేడి నీటి మిషన్‌ సరిగా పని చేయడం లేదు. కొన్ని సార్లు  60 మంది విద్యార్థులకు సరిపడ మాత్రమే వేడి నీళ్లు వస్తున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. మిగతా 300మంది విద్యార్థులు చన్నీటితోనే స్నానం చేస్తున్నారు. 

మినరల్‌ వాటర్‌ మిషన్‌ గతేడాది నుంచి పని చేయడంలేదు, బోరు నీరులేదా, భగీరథ వాటర్‌నే విద్యార్థులు తాగుతున్నారు. మహమ్మదాబాద్‌ మండల కేంద్రంలోని కేజీబీవీలో సోలార్‌ వేడి నీటి యంత్రం, ఆర్‌వో ప్లాంటు పని చేయడం లేదు. జిల్లా కేంద్రానికి 18 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఓ కస్తూర్బాలో  స్నానం చేయాలంటే ఉదయం ఐదు గంటలకు లేవాల్సిన పరిస్థితి ఏర్పడిందని విద్యార్థులు వాపోతున్నారు. ఆలస్యమైతే స్నానానికి నీరు దొరకదని,  రెండు రోజులకు ఒక సారి స్నానం చేయాల్సి వస్తోందని వాపోతున్నారు. 





Updated Date - 2022-08-12T06:01:52+05:30 IST